భారత టీకా మహా యజ్ఞం ఇప్పటి వరకు దేశంలో 24 కోట్లు టీకాలు వేశారు 3 కోట్ల మందికి వైరస్ సోకింది.
ప్రస్తుతం అక్టీవ్ కేసులు సుమారు 12లక్షల కేసులు మాత్రమే. రోజూ కొత్తగా పెరుగుతున్న కేసులు మే నెల రెండవ వారంలో అతి ఎక్కువగా వచ్చిన 4 లక్షల కేసులు నుండి ప్రస్తుతం రోజూ వారీ కొత్త కేసులు 90 వేలకి వచ్చాయి.
భారతదేశం ప్రస్తుతానికి రోజుకు 30 లక్షల మందికి టీకాలు వేస్తోంది. అంటే సుమారు ఒక కెనడా దేశంలో పూర్తి జనాభాకు ఒక రోజులో టీకాలు వేస్తున్నాది అన్నమాట. మే నెల మొదటి అర్ధభాగంలో భారత్ సుమారు ఒక ఖాతార్ దేశ జనాభాకు అంటే 20 లక్షల మందికి ఒక్క రోజులో టీకాలు వేసింది.
మొత్తం మే నెలలో భారతదేశం ఒక UK మొత్తం జనాభాకు అంటే సుమారు 8 కోట్ల మందికి ఒకసారి టీకాలు వేసింది. జూన్ చివరి నుండి భారతదేశం రోజుకు ఒక న్యూజిలాండ్ దేశ జనాభాకు అంటే 50లక్షలు మందికి ఒక్క రోజులో టీకాలు వేద్దాము అని ఆశిస్తోంది
జూలై నాటికి రోజుకు ఒక ఇజ్రాయెల్ దేశ జనాభా అంతటికి అంటే సుమారు కోటి టీకాలు ఒక్కరోజులో వేద్దాం అని ప్రణాళికలు వేస్తోంది అంటే ఒక్క జూలై నెలలోనే భారతదేశం ఒక అమెరికా దేశ జనాభా మొత్తానికి ఒక్కరోజులో ఒక్క టీకా వేద్దామని ప్లాన్. చూసారా.. వాక్సినేషన్ ఇక్కడ ఎంత పెద్ద యజ్ఞమో…
కానీ… దీనికి కూడా బోల్డు ఇబ్బందులు ఉన్నాయి.
– కరోనా వాక్సిన్ పొలియో వాక్సిన్ లాగా ఎవరో NGO వర్కర్స్ ఇంటింటికి తిరిగి నోట్లో నాలుగు చుక్కలు వెయ్యడం కాదు. ఇంజెక్షన్ ద్వారా ఇవ్వాలి కాబట్టి అలా ఇంజెక్షన్ చేయడం నేర్చుకున్న క్వాలిఫైడ్ నర్స్ లు కావాలి. లేకపోతే ఎవరి చేత పెడితే వారి చేత ఇంజెక్షన్స్ ఇప్పించి అవి రియాక్షన్ వస్తే అదో ప్రమాదం మరియు ప్రభుత్వాలకు అప్రతిష్ట. రియాక్షన్ వంటి సంఘటనలు వల్ల ప్రజలలో మళ్ళీ వాక్సిన్స్ పై అనుమానాలు కలగడం.
– విదేశీ టీకాలు ముఖ్యంగా అమెరికా ఫైజర్ టీకా, చైనా సైనోవాక్ టీకాలు మనదేశంలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది అని ఆ కంపెనీలు గుర్రుగా ఉన్నాయి…అందువల్ల మన టీకా యజ్ఞాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి లేదా అడ్డంకులు సృష్టించాలి అని ఇక్కడ ఉన్న కొన్ని దేశ ద్రోహ శక్తుల ద్వారా అవి తప్పక ప్రయత్నిస్తాయి.. గత నెలలో పూణేలో గల మన అతిపెద్ద వాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దానిని ఈ దృష్టి తోనే చూడాలి. సుమారు వెయ్యి కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.. ఆస్తి నష్టం కంటే ఎక్కువ ప్రమాదం ఏమిటంటే ఇటువంటి సంఘటనలు వాక్సిన్ ఉత్పత్తిని తగ్గించి ప్రభుత్వ భారీ వాక్సిన్ కార్యక్రమానికి గండి కొడతాయి. ఆ కంపెనీలకు కావలసింది అదే..
దీనిని బట్టి అంచనా వెయ్యండి. ఎక్కువగా వున్న జనాభా వల్ల ఈ టీకాలు వెయ్యడం అనే ప్రక్రియ ఈ దేశంలో ఎంత కష్టతరమో.. అంతే కాదు.. ఈ యజ్ఞంలో మధ్యలో ప్రభుత్వం కాళ్లకు అడ్డం పడే NGO లు – ప్రతిపక్షాలు – పిల్ లాయర్లు – కోర్టులు.
అలాగే ఇంకొకటి గమనించండి. భారతీయ వ్యాక్సిన్లు ప్రపంచంలోనే అతి చౌకైనవి అని మర్చిపోకండి. ప్రపంచంలోనే మన భారతదేశంలా సొంత వ్యాక్సిన్ కలిగి ఉన్న దేశాలు కూడా చాలా తక్కువ.
అందువల్లే మన దేశం అమేజింగ్ ఇండియా …
అందుకే పైన చెప్పిన వాటిని అన్నిటిని దృష్టిలో ఉంచుకొని దయచేసి వాక్సిన్ కార్యక్రమం మీద అనుకూలతను వ్యాప్తి చేయండి. అంతేకానీ మన దేశంలో వాక్సినేషన్ మీద తక్కువ జనాభా గల దేశాలతో పోల్చి మన దేశాన్ని చిన్నబుచ్చకండి. ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్న సిబ్బందిని అభినందించండి.
వాక్సిన్ మీద అనుమానాలు వ్యక్తం చేసే మన బంధువులు, స్నేహితులు, పని వారు మొ. వారికి ధైర్యం చెప్పి వాక్సిన్ తీసుకోమనండి.
ఇంత ప్రణాళికా బద్దంగా భారీ ఎత్తున మన భారతదేశం అమలు చేస్తున్న ఈ వాక్సినేషన్ యజ్ఞం గురించి గర్వంగా ఫీల్ అవ్వండి.
…చాడా శాస్త్రి..