ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి రక్షణ బలగాల శక్తి సామర్థ్యాలు పెంచేందుకు పెద్దపేట వేస్తున్నారు. మూడు రకాల సైనిక బలగాల (ఆర్మీ , నేవీ, ఎయిర్ ఫోర్స్) అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అత్యాధునిక టెక్నాలజీ, శక్తి వంతమైన ఆయుధ సంపత్తిని సమకూరుస్తున్నారు. దీంతో భారత రక్షణ బలగాల పటిష్టత అంతకంతకు పెరుగుతోంది.
తాజాగా భారత నావికా దళం చేపట్టిన ఒక ఆపరేషన్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. మన దేశం అవసరాల కోసం మాత్రమే కాకుండా,, కష్టాల్లో ఉన్నప్పుడు పొరుగు దేశాల సమస్యలను కూడా తీర్చేందుకు భారత నావికా దళం ముందడుగు వేస్తూన్నది. తాజాగా ఒమన్ తీరంలో మునిగిపోతున్న ఒక చమురు రవాణా ఓడను భారత నావికా దళం కాపాడింది. ఒమన్ లోని రస్ మద్రకకు 25 నాటికల్ మైళ్ళ దూరంలో ఎం వి ఫాల్కన్ అనే రవాణా ఓడ సాంకేతిక కారణాలతో మునిగిపోవడం మొదలుపెట్టింది. యుద్ధ విన్యాసాల కోసం అటుగా వెళుతున్న భారత నావిక దళానికి చెందిన ఐ ఎన్ ఎస్ తేజ్ వెంటనే స్పందించింది. మునిగిపోతున్న రవాణా ఓడ సమీపంలోకి చేరుకున్న భారత నావిక అధికారులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు. చమురు ఓడలోని 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక జాతీయులు మరియు ఓడ సిబ్బంది నీ సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారు. ఇందుకోసం ప్రాణాలకు తెగించి నావిక దళ అధికారులు సిబ్బంది కృషి చేశారు. మొత్తానికి ఆపరేషన్ విజయవంతం కావడంతో అందరు ప్రాణాలు దక్కాయి అని అనుకోవచ్చు.
నడిసముద్రంలో భారత నావికా దళం సాహసంతో చేపట్టిన ఈ ఆపరేషన్ మీద ఇతర దేశాల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ, అత్యుత్తమ సాధనాసంపత్తితో భారత నావికా దళం పనిచేస్తుందని మరోసారి రుజువు అయింది.