ఎందుకంటే, సూడాన్ లో జరుగుతున్న అంతర్యుద్ధ పరిస్థితుల్లో మన భారతీయులు సుమారుగా 3000 మంది చిక్కుకు పోయారు. మన ఎయిర్ ఫోర్స్ నేవీ కలిపి ఇప్పటి వరకు సుమారు 2400 మందిని భారతదేశం తీసుకు వచ్చాయి.
అయితే, ఈ ఆపరేషన్ మొత్తంలో అత్యంత రిస్క్ తో కూడిన అపరేషన్ ని ఉత్తర ఖరథోమ్ కి 40 కి.మీ దూరంలో ఉన్న వాడి సయ్యద్నా వద్ద ఉన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్ నుండి ఏప్రిల్ 27-28 తేదీల మధ్య చేశారు. ఈ ఎయిర్ స్ట్రిప్ పై లైటింగు సదుపాయం లేదు. పోర్ట్ సుడాన్ చేరుకోవడానికి మార్గం లేని 121 మంది ప్రయాణీకులను (వారిలో గర్భిణీ స్త్రీతో సహా కొన్ని వైద్య కేసులు కూడా ఉన్నాయి) మన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సురక్షితంగా భారత్ తీసుకువచ్చింది.
ఈ కాన్వాయ్కి భారత డిఫెన్స్ అటాచ్ నాయకత్వం వహించారు, వారు ‘వాడి సయ్యద్నా’ వద్ద ఎయిర్‌స్ట్రిప్‌కు చేరుకునే వరకు IAF అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. అక్కడ దెబ్బతిన్న (రన్ వే కల) ఎయిర్‌స్ట్రిప్ ఉంది. నావిగేషనల్ అప్రోచ్ ఎయిడ్స్ లేవు, అవసరం అయితే రి ఫ్యూయల్ చేసుకునే సదుపాయం లేదు. అన్నిటి కంటే అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఏమిటంటే రాత్రి సమయంలో విమానం ల్యాండింగ్ గైడ్ చేయడానికి అవసరమైన ల్యాండింగ్ లైట్లు లేవు.
మన సిబ్బంది ఎయిర్‌స్ట్రిప్‌ను సమీపిస్తున్నప్పుడు, ఎయిర్‌క్రూ వారి ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్ఫ్రా రెడ్ సెన్సార్లను ఉపయోగించి రన్‌వే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉందని మరియు సమీపంలో ఎటువంటి ప్రమాదకర శక్తులు లేవని నిర్ధారించారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చీకటి రాత్రిలో రన్ వే మరియు ఇతర ప్రాంతాలు పరిశీలించడానికి నైట్ విజన్ గాగుల్స్ ఉపయోగించారు.
ల్యాండింగ్ అయిన తర్వాత, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లు అలా రన్ అవుతూనే ఉంచి, ఎనిమిది మంది IAF గార్డ్ కమాండోలు ప్రయాణికులను మరియు వారి లగేజీని విమానంలోకి ఎక్కించారు. ల్యాండింగ్ మాదిరిగానే, ఆ చీకటి రన్‌వే నుండి టేకాఫ్ కి నైట్ విజన్ గాగుల్స్ ఉపయోగించారు.
వాడి సయ్యద్నా మరియు జెద్దా మధ్య సుమారుగా రెండున్నర గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ క్లిష్టమైన పరిస్థితులలో కూడా సురక్షితంగా ఆపరేషన్ నిర్వహించగల మన IAF నిర్వహణా సామర్ధ్యాలను తెలియ చెప్పింది.
ఈ ఆపరేషన్ IAF చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది అని IAF అధికారులు చెప్పారు. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే సరిగ్గా అదే ఎయిర్ స్ట్రిప్ మీద ఏప్రిల్ 27న ల్యాండ్ అయి ఉన్న టర్కీ ప్లేన్ మీద రెబెల్స్ కాల్పులు జరిపారు. అదే రాత్రి మన ఎయిర్ ఫోర్స్ ఈ ఆపరేషన్ విజయవంతం గా నిర్వహించింది.