బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇచ్చి విదేశాలకు పంపిన మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టును ఛేదించింది ఉత్తరప్రదేశ్ ఏటీఎస్. మొత్తం 9మంది బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మోసం, నేరపూరిత కుట్రపై నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బంగ్లాదేశ్ పౌరులైన అసిదుల్ ఇస్లాం, హుస్సేన్ మహ్మద్, అలమీన్ అహ్మద్, జైబుల్ ఇస్లాం, జమీల్ అహ్మద్, రాజీవ్ హుస్సేన్, షెకావత్ ఖాన్ ,అల్లాదీన్ తారిఖ్ లను అరెస్ట్ చేసినట్టు ఏటీఎస్ వివరించింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రధాన సూత్రధారి మఫ్సర్ రెహ్మన్ ను అరెస్ట్ చేశారు. వారందరి నుంచీ లక్ష రూపాయల చొప్పున తీసుకుని హిందూపేర్లు పెట్టిన నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలు అందజేసినట్టు తేలింది.
పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలోని మదర్సాలో ముజుఫుజుర్ రెహ్మాన్ ను ఏటీఎస్ అరెస్ట్ చేసింది. అయితే రెహ్మాన్ కూడా బంగ్లాదేశీయుడేనని తేలింది. ఫేక్ ఐటీతో భారత్ లో నివసిస్తున్నట్టు పోలీసులు నిర్థారించారు. అతన్ని ట్రాన్సిట్ రిమాండ్‌పై లక్నోకు తరలించారు. ఇక ఆ రాకెట్ తో సంబంధం ఉన్న మరికొందర్నీ గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ ఆధారంగా అరెస్టులుంటాయని ఏటీఎస్ అధికారులు తెలిపారు.
నివేదిక ప్రకారం, అసిదుల్ ఇస్లాం… విజయ్ దాస్‌గా, హుస్సేన్ మహ్మద్ ఫహద్ …మాణిక్ దత్తాగా, అలమేన్ ..
రాజేష్ బిస్వాస్గా, జైబుల్ హుస్సేన్ .. గోవింద దాస్‌గా, రాజీవ్ హుస్సేన్ ..అజిత్ దాస్‌గా, షేకావత్ ఖాన్ …
గోలక్ మండల్ గా, అల్లాదీన్ తారిఖ్ …రింకోన్ బిస్లీష్ గా, జమీద్ తారిఖ్ జమీల్ పాలాస్ గా మారారు. వారికి మదర్సాల్లో హిందీలో శిక్షణఇచ్చారు. మాట్లాడడం సంతకం చేయడం నేర్పించారు. తరువాత హిందూ పేర్లతో భారతీయ పాస్ పోర్టులు ఇచ్చి విదేశాలకు పంపేందుకు సిద్ధమయ్యారు.
అక్టోబర్ 26న మిథున్ మండల్, షాన్ అహ్మద్, మోమినూర్ ఇస్లాం , మహేంది హసన్‌లను మానవ అక్రమ రవాణా కేసులో మొఘల్‌సరాయ్‌లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ లో అరెస్టు చేశారు. మిథున్ మండల్, షాన్ అహ్మద్, మోమినూర్ ఇస్లాం మరియు మహేంది హసన్ అందించిన సమాచారం ఆధారంగా కాన్పూర్‌లోని బంగ్లాదేశ్ జాతీయులను అరెస్టు చేసినట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఐజి గజేంద్ర గోస్వామి తెలిపారు. ఇక ఇలాగే నకిలీ పత్రాలతో భారత్ నుంచి విదేశాలకు అక్రమంగా వెళ్తున్న ఇద్దరు బంగ్లాదేశ్ రోహింగ్యాలైన నూర్ ఆలం , మహ్మద్ జమీల్‌లను UP ATS అరెస్టు చేసింది.