భారత క్రికెట్ జట్టు ఆడగాళ్లకు కొత్త మెనూ అమలు చేయాలని నిర్ణయించింది బీసీసీఐ. ఇకనుంచి హలాల్ ధ్రువీకరణ ఉన్న మాంసాన్ని మాత్రమే ఆటగాళ్లు తినాలి (పంది మాంసం మరియు గొడ్డు మాంసం మినహాయింపు). స్పోర్ట్స్ టాక్ ఈ విషయాన్ని రిపోర్టు చేసింది. ఇటీవల ముగిసిన టీ-20 ప్రపంచకప్ పోటీల్లో భారత్ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. 2007 నుంచి తొలిసారి టీం సెమీస్ కు అర్హత సాధించలేకపోయింది.
కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కొత్తగా బాధ్యతలు తీసుకున్న వేళ.. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న టీం విషయంలో కఠినమైన డైట్ ప్లాన్ ను అమలు చేయాలని ప్రతిపాదన వచ్చింది. అందులో భాగంగా ఆటగాళ్లు ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలంటే…మాంసం తినే క్రికెటర్లు కచ్చితంగా హలాల్ సర్టిఫైడ్ ఉన్న వాటినే తినాల్సి ఉంటుంది. ఇతర ఏ రకమైన మాంసాన్నీ వారు తీసుకోవడానికి వీల్లేదు.
ముఖ్యమైన సిరీస్ లకు ఆటగాళ్లను సిద్ధం చేసే లక్ష్యంతో బీసీసీఐ సరికొత్త ఆహార నియమావళిని రూపొందించింది. ముఖ్యమైన సిరీస్ లు, ఐసీసీ ఈవెంట్లకు వెళ్లే ఆటగాళ్లు సరిపడా కాలరీల ఆహారం మాత్రమే తీసుకునేలా ఫిట్ గా ఉండాలని… నడుము చుట్టూ కొవ్వు చేరితే గ్రౌండ్లో వారి పనితీరుపై ప్రభావం చూపుతుందని బీసీసీఐ చెబుతోంది. అన్ని ఫార్మాట్లలో నాన్‌స్టాప్ క్రికెట్ ఆడుతున్న కొందరు ఇతరదేశాలకు వెళ్లి ఆడుతున్నప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండడం లేదట . అందుకే ఇకనుంచి రోజూ మాంసం తినే ఆటగాళ్లకోసం కొన్ని పరిమితులతోడైట్ రూపొందించారు.
అయితే హలాల్ సర్టిఫైట్ మాంస ఉత్పత్తుల్ని మాత్రమే తీసుకోవాలన్న కొత్త నిబంధనపై ఓవర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాంసాహారం, శాఖాహారంగా మాత్రమే హలాల్ ప్రక్రియను చూస్తున్నారు తప్ప దానివెనక మత కోణం ఉందనే దాన్ని పరిగణనలోకి తీసుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హలాల్ ను ముస్లింలు మాత్రమే చేస్తారు. ముస్లిమేతరులు హలాల్ చేయలేరు. ఎందుకంటే పూర్తిగా ఇస్లామిక్ ఆచారం ప్రకారం హలాల్ ఉంటుంది. హలాల్ సంస్థలో ముస్లిమేతరులు ఉద్యోగులుగా కూడా ఉండరు. ముస్లిమేతరులను తీసుకోకూడదని హలాల్ సర్టిఫికేషన్ అథారిటీ అధికారిక వెబ్ సైట్లో స్పష్టంగా ఉంటుంది కూడా.
ఇస్లామిక్ పద్ధతిలో జరిగే జంతువధకు సంబంధించిన మార్గదర్శకాలు ఆ జాబితాలో చూడవచ్చు. వధకు సంబంధించి ప్రతీదశలోనూ ముస్లింలను మాత్రమే అనుమతిస్తారు. మాంసం లేబులింగ్ కూడా ముస్లింలే చేస్తారు.
ఇక యూరోపియన్ యూనియన్ హలాల్ సర్టిఫికేషన్ విభాగంలోనూ ఉద్యోగావకాశాలు ముస్లింలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. “వధ ప్రక్రియలో ముస్లిం మాత్రమే ఉండాలి. ముస్లిమేతరులు వధించిన జంతువు మంసం హలాల్ కాదు. వధ సమయంలో బిస్మిల్లాహ్ అల్లాహు అక్బర్అని తప్పనిసరిగా ప్రస్తావించాలి. వధ చేసే సమయంలో అల్లాహ్ తప్ప మరెవరి పేరునైనా పలికితే అది హరామ్ అంటే చట్టవిరుద్ధం అవుతుంది’.
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై ముస్లిమేతరులు హలాల్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.