ప్రపంచంలోని ప్రసిద్ధ కార్పొరేట్ కంపెనీలకు ప్రస్తుతం భారతీయులే బాస్ లుగా ఉన్నారు. మేమేం తక్కువ తిన్నామంటూ ప్రపంచంలో ఎక్కడున్నా సత్తా చాటుతోంది భారతనారి. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థకు సీఈవోగా నియమితురాలైంది ప్రవాసభారతీయ మహిళ. ప్రపంచ ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ చానల్ కి గ్లోబల్ సీఈవోగా నియమితులయ్యారు లీనా నాయర్. వచ్చే ఏడాది జనవరిలో ఆమె పదవీ బాధ్యత తీసుకుంటారు. యూనిలీవర్ సంస్థలో చీఫ్ హుమన్ రిసోర్స్ ఆఫీసర్గా పని చేస్తున్న లీనా పదవి ఈ ఏడాదితో ముగియనుంది.యూనీలీవర్లో ఆ స్థాయికి చేరుకున్న తొలి ఆసియా మహిళా ఆమెనే. 1992లో యూనిలీవర్లో ఫ్యాక్టరీ ఫ్లోర్ ట్రైనీగా ఎంటరైన లీనా…ఇంతింతై అన్నట్టు ఎదుగుతూ చీఫ్ హెచ్ఆర్వో స్థాయికి చేరింది.
లీనాభారత్ లోనే పుట్టి…ఇక్కడే చదివింది. మహారాష్ట్ర కోల్హాపూర్ లో పుట్టిన లీనా… సాంగ్లీలోని వాల్ చంద్ కాలేజీలో ఇంజినీరింగ్ చేసింది. తరువాత జంషెడ్ పూర్ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (XLRI)లో బంగారు పతకంలో మేనేజ్మెంట్ డిగ్రీ అందుకుంది.
యూనిలీవర్లో 30 ఏళ్ల పాటు సీహెచ్ఆర్వోగా లక్షన్నర మంది ఉద్యోగుల బాధ్యతల్ని చూశారు. 2000లో హిందుస్థాన్ లివర్ ఇండియా HR మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించారు.. కొంతకాలానికే జనరల్ మేనేజర్ హోదాకు ఎదిగారు . 2016 నుంచి లండన్ ప్రధాన కార్యాలయంలో సీహెచ్ఆర్వో కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారు.
లీనాకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది. ఇక లీనా కొత్తగా బాధ్యత తీసుకునే ఫ్రాన్స్ కంపెనీ ప్రపంచంలోనే టాప్ ఫ్యాషన్ బ్రాండ్లలో ఒకటి. ఫ్రాన్స్ కే చెందిన బిలియనీర్ అలెన్ వెర్తిమీర్ స్థాపించిన ఈ గ్రూప్ ఏటా లక్షల కోట్ల టర్నోవర్ సాధిస్తోంది.