టోక్యో పారాలింపిక్స్ లో ఇప్పటివరకు భారత్ 8 పతకాలు(2 బంగారు,3 రజతం,3 కాంస్యం) సాధించింది..
• టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ – క్లాస్ 4 విభాగంలో భావినా పటేల్ రజత పతకం సాధించి భారత్ కు తొలి పతకం అందించింది ..
• పురుషుల డిస్కస్ త్రో – F52 విభాగంలో వినోద్ కుమార్ కాంస్య పతకం,
• పురుషుల డిస్కస్ త్రో – F56 విభాగంలో యోగేష్ కతునియా రజత పతకం,
• జావెలిన్ త్రో – F46 విభాగంలో దేవేంద్ర రజత పతకం,
• జావెలిన్ త్రో – F46 విభాగంలో సుందర్ సింగ్ గుర్జార్ కాంస్య పతకం,
• షూటింగ్: R2 10M ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 విభాగంలో అవని లేఖర బంగారు పతకం,
• 10M ఎయిర్ పిస్తోల్ SH1 విభాగంలో సింఘ్రాజ్ అధానా కాంస్య పతకం,
• జావెలిన్ త్రో – F 64 విభాగంలో సుమిత్ ఆంటిల్ బంగారు పతకం సాధించారు..
పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా షూటర్ అవని లేఖర క్రీడా చరిత్ర సృష్టించింది.
పతకాలు గెలిచిన క్రీడాకారులకు దేశ ప్రధాని మోదీ ,రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ సహా పలువురు ఆభినందనలు తెలిపారు.
Pics Courtesy : Sports Authority of India