ఆపరేషన్ సింధూర్ గొప్పతనం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తున్నది. ఐక్యరాజ్య సమితి భద్రతా వ్యవస్థల కీలక సమావేశంలో భారత్ పాల్గొన్నది. అంతర్జాతీయ వేదిక మీద భారత మిలటరీ ఆపరేషన్స్ డైరక్టర్ జనగర్ రాజీవ్ ఘాయి…. ఆపరేషన్ సింధూర్ వివరాలను లెక్కలతో సహా వివరించారు.
……………………………………………
మే 7న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత భూభాగంలో ఉన్న తొమ్మిది ఉగ్రశిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం కచ్చితమైన దాడులు జరిపింది. పాకిస్థాన్ డ్రోన్లను ఉపయోగించి భారత సరిహద్దు ప్రాంతాల్లో నష్టం కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ, అవి పూర్తిగా విఫలమయ్యాయని లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ చెప్పారు. డ్రోన్ దాడులకు ప్రతిగా భారత వైమానిక దళం ….. పాక్ సైనిక స్థావరాలపై తీవ్ర వైమానిక దాడులు జరిపిందని రాజీవ్ ఘాయ్ తెలిపారు.
……………………………………………………
భారత్ దాడుల్లో పాకిస్థాన్ లోని 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు అని స్పష్టం చేశారు. మొత్తం ఎనిమిది ఎయిర్‌బేస్‌లు, మూడు హ్యాంగర్లు, నాలుగు రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి అని చెప్పారు. పాకిస్థాన్ ఒక సి-130 రకానికి చెందిన విమానం, నాలుగు నుంచి ఐదు యుద్ధ విమానాలను కోల్పోయిందని వివరించారు. 300 కిలోమీటర్ల దూరం నుంచి భూస్థాయి క్షిపణులతో ఐదు ఫైటర్ జెట్లు కూల్చివేయడం ప్రపంచంలోనే అతి పొడవైన ఎయిర్ కిల్‌గా నమోదైందని చెప్పారు. కాగా, పహల్గాం దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను జూన్‌లో భారత సైన్యం హతమార్చిందని రాజీవ్ ఘాయ్ తెలిపారు.
…………………..
ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి పాకిస్థాన్ కాకి లెక్కలు చెబుతోందని ఆధారాలతో భారత్ బయట పెట్టింది. దీంతో పాకిస్థాన్ దొంగ నాటకాలు అంతర్జాతీయ వేదిక మీద బట్టబయలు అయిపోయింది.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”><a href=”https://twitter.com/hashtag/WATCH?src=hash&ref_src=twsrc%5Etfw”>#WATCH</a> | Delhi | Director General Military Operations Lt Gen Rajiv Ghai says, "So the drones came in in large numbers even after the two DGMOs had spoken… This led us to swing the Indian Air Force into action, and in the precision strikes that they carried out on the night of… <a href=”https://t.co/XhTdvxaest”>pic.twitter.com/XhTdvxaest</a></p>— ANI (@ANI) <a href=”https://twitter.com/ANI/status/1978072471539765444?ref_src=twsrc%5Etfw”>October 14, 2025</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>