భారత సాయుధ దళాల విజయాన్ని స్మరించుకోవడానికి, ఆపరేషన్ “విజయ్” లో అమరవీరుల అత్యున్నత త్యాగానికి నివాళులర్పించేందుకు.. కార్గిల్ సెక్టార్‌లోని ద్రాస్ లోని పాయింట్ 5140కి “గన్ హిల్” అని నామకరణం చేసింది భారత సైన్యం.
https://twitter.com/adgpi/status/1553258449433088000?s=20&t=6c0-p-PiRr7wNJAgRbfDGQ
ఆర్టిలరీ రెజిమెంట్ తరపున, ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఆర్టిలరీ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ టికె చావ్లా.. ఆపరేషన్‌లో పాల్గొన్న వెటరన్ గన్నర్లతో కలిసి పుష్పగుచ్ఛం ఉంచారు. లెఫ్టినెంట్ జనరల్ అనింద్యా సేన్‌గుప్తా, కూడా ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఉంచారు.
ఆపరేషన్ విజయ్ లో “కార్గిల్” అనే గౌరవ బిరుదు పొందిన అన్ని ఆర్టిలరీ రెజిమెంట్లకు చెందిన అనుభవజ్ఞుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
https://twitter.com/airnewsalerts/status/1553244204763353088?s=20&t=6c0-p-PiRr7wNJAgRbfDGQ