IWF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2022లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా హర్షదా శరద్ గరుడ్ సోమవారం చరిత్ర సృష్టించారు. ఆమె 45-కిలోల బరువు విభాగంలో 153-కిలోలు ఎత్తింది. పోటీ ప్రారంభ రోజునే భారత్‌కు పతకం రావడంతో హర్షద శరద్ గరుడ్ ఎనిమిది మంది పోటీదారులను వెనక్కి నెట్టారు. టర్కీకి చెందిన బెక్టాస్ కాన్సు రజత పతకాన్ని కైవసం చేసుకోగా, మోల్డోవాకు చెందిన టియోడోరా-లుమినిటా హింకు కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
అదే వెయిట్ విభాగంలో మరో భారతీయురాలు అంజలి పటేల్ 148 కిలోల బరువును ఎత్తి ఐదో స్థానంలో నిలిచింది.
హర్షదా శరద్ గరుడ్ కంటే ముందు IWF జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన భారతీయులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మీరాబాయి చాను 2013లో కాంస్యం సాధించగా, గతేడాది అచింత షెలీ రజత పతకాన్ని గెలుచుకుంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)