విదేశీ వ్యవహారాలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేస్తున్న ఎత్తుగడలు మామూలుగా లేవు. శత్రు దేశాలైన చైనా పాకిస్థాన్ లకు చెక్ పెట్టే విధంగా మోడీ అద్భుతమైన పావులు కదుపుతున్నారు. చైనాను బలంగా వ్యతిరేకించే అమెరికా , జపాన్ , ఆస్ట్రేలియా లతో కలిసి ఇప్పటికే క్వాడ్ కూటమి ఏర్పాటు అయింది. తాజాగా క్వాడ్ కూటమి తరుపున భద్రత బలగాల గ్రూపు తయారు అవుతోంది.
అధికారికంగా చెప్పక పోయినప్పటికీ,, చైనా పాకిస్తాన్ పిచ్చి వేషాలు వేసినట్లయితే తాట తీసేందుకు ఈ భద్రత కూటమి రంగంలోకి దిగుతుంది.
రక్షణ పరంగా క్వాడ్ భద్రతా కూటమి అత్యంత కీలకం అవుతుంది.
విల్లింగ్టన్ కేంద్రంగా జరుగుతున్న నాలుగు దేశాల అగ్ర నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారు దీనిని విల్లింగ్టన్ డిక్లరేషన్‌గా ప్రకటించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షులు జో బైడెన్, నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి కిషిడా ఫూమియో , ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని అల్బనిస్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ఇది ఈ నాలుగు దేశాల మధ్య పూర్తి స్థాయి రక్షణ ఒప్పందంగానే ఉన్నప్పటికీ , అధికారిక ముద్ర లేకుండా లోపాయికారిగా దీనిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా పరోక్షంగా పాకిస్థాన్ చర్యలపై నిప్పులు కురిపించారు. ముంబై ఉగ్రదాడులు, పఠాన్‌కోట్ దాడి గురించి ప్రస్తావించారు. అదే సమయంలో చైనా, ఉత్తరకొరియాల తీరును కూడా పరోక్షంగా ఎండగట్టారు.
ఈ సదస్సులో … చైనా దేశపు సరిహద్దు ప్రాంతాలలో పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు.
ఇందుకోసం భారత్, అమెరికా, జపాన్ కోస్ట్‌గార్డులు, ఆస్ట్రేలియా సరిహద్దు దళం సంయుక్తంగా పనిచేస్తాయి. 2025లో మైత్రి శిక్షణ కార్యక్రమాలను భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. సముద్రాల్లో క్వాడ్ పోర్టులను ఏర్పాటు చేసి, పరస్పరం సహకరించుకోవాలని నలుగురు నేతలు సంకల్పించారు. దీనిపై ముంబైలో ‘క్వాడ్ ప్రాంతీయ పోర్టులు-రవాణా సదస్సు’ను నిర్వహించాలని నిర్ణయించారు.
మొత్తం మీద భారత్ వ్యతిరేక శక్తులకు చుక్కలు చూపించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం బలంగా పనిచేస్తోంది. అమెరికా ఆస్ట్రేలియా జపాన్‌లతో కలిపి చైనా దూకుడికి కళ్లెం వెయ్యబోతున్నారు.