………………………………………………
దేశ రక్షణ రంగంలో భారత్ మరో భారీ ముందడుగు వేయబోతోంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ తంత్రాలకు పెట్టింది పేరైన ఇజ్రాయెల్ తో ఒప్పందం చేసుకొంటోంది. ‘గోల్డెన్ హారిజన్’ అనే శక్తివంతమైన మిస్సైల్ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, గగనతల రక్షణను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఈ అత్యాధునిక క్షిపణిని మన సైన్యం వినియోగించనుంది.
……………………………………………………
ఈ గోల్డెన్ హారిజన్ క్షిపణి తన అమోఘమైన వేగంతో శత్రువుల రాడార్లకు చిక్కకుండా దూసుకెళ్లగలదు. దీని ప్రత్యేకత ఏమిటంటే, శత్రువుల స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశిస్తే, అది ఎంతటి కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ఉన్నా సరే, ఈ క్షిపణి దానిని బూడిద చేయడం ఖాయం. ఇది భారత వైమానిక మరియు క్షిపణి సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎక్కించనుంది. పైగా దీనిని ఆపటం పాకిస్థాన్ దగ్గర ఉన్న రాడార్లకు సాధ్యం కాదు. దీంతో పాకిస్థాన్ లోని ఏ సిటీని అయినా టార్గెట్ చేసి, బూడిద చేసి పారేయవచ్చు.
…………………………………………………………………………
ఈ క్షిపణి చేరికతో ముఖ్యంగా పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు భారీ ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ నుంచి ప్రయోగించిన పక్షంలో, పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, కరాచీ వంటి ప్రాంతాల్లోని వ్యూహాత్మక లక్ష్యాలను ఇది సులువుగా చేరుకోగలదు. శత్రువుల కంచుకోటలను మట్టికరిపించి, వారి సైనిక స్థావరాలను క్షణాల్లో నామరూపాలు లేకుండా చేసే సత్తా దీనికి ఉంది.
మోదీ ప్రభుత్వం చేసుకొంటున్న ఈ ఒప్పందం ద్వారా భారత్ తన దౌత్య మరియు రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది. సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలను ఏరిపారేయడానికి, యుద్ధ సమయంలో శత్రువుల కదలికలను స్తంభింపజేయడానికి ఈ గోల్డెన్ హారిజన్ ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేయనుంది. ఈ క్షిపణి చేరికతో దక్షిణ ఆసియాలో భారత్ సైనిక ఆధిపత్యం మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.



