……………………………………………….
భారతదేశ రక్షణ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికాతో కీలక ఒప్పందాలు చేసుకుంటూనే, మరోవైపు ఫ్రాన్స్‌తో భారీ రక్షణ డీల్‌ను ఖరారు చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య నైపుణ్యానికి, ఆయనలోని ‘వ్యూహాత్మక చాణక్యుడికి’ నిదర్శనం. తాజాగా రూ. 3.60 లక్షల కోట్ల భారీ కొనుగోళ్లకు ఆమోదం తెలపడం ద్వారా భారత్ ప్రపంచానికి ఒక బలమైన సంకేతాన్ని పంపింది.
……………………………………..
గతంలో ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్‌కు వణుకు పుట్టించింది ఈ రఫేల్ యుద్ధ విమానాలే, అందుచేతనే ఇప్పుడు అదనంగా 114 రఫేల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 36 విమానాలకు ఇవి తోడైతే, భారత వాయుసేన అమ్ములపొదిలో రఫేల్ సంఖ్య 150కి చేరుతుంది. ఇది కేవలం కొనుగోలు మాత్రమే కాదు, ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో రఫేల్ మాతృ సంస్థ ‘డసో ఏవియేషన్’ భాగస్వామ్యంతో భారత్‌లోనే వీటి తయారీకి ప్రయత్నాలు జరగడం విశేషం.
…………………………………….
కేవలం వాయుసేనకే పరిమితం కాకుండా, భారత సైన్యం మరియు నౌకాదళాన్ని ఆధునీకరించడంలో ప్రధాని మోదీ దార్శనికత స్పష్టంగా కనిపిస్తోంది:
నౌకాదళం: సముద్ర గర్భంలో జలాంతర్గాములను వేటాడే P-8I యాంటీ సబ్‌మెరైన్ విమానాలు, మెరైన్ గ్యాస్ టర్బైన్ జనరేటర్లతో సముద్ర జలాలపై భారత్ పట్టు సాధించనుంది.
సైన్యం: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘విభవ్’ యాంటీ ట్యాంక్ మైన్స్, T-72 ట్యాంకుల ఆధునీకరణ ద్వారా సరిహద్దుల్లో శత్రువుల ఆట కట్టించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
వాయుసేన: గగనతల నిఘా కోసం హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్లు, కాంబాట్ క్షిపణుల కొనుగోలు రక్షణ వ్యవస్థను తదుపరి స్థాయికి తీసుకెళ్లనున్నాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పర్యటనకు ముందే ఈ భారీ డీల్‌కు ఆమోదం తెలపడం వెనుక మోదీ రాజకీయ చతురత ఉంది. ఏ ఒక్క దేశంపై ఆధారపడకుండా, జాతీయ ప్రయోజనాలే పరమావధిగా విదేశీ వ్యవహారాలను నడిపిస్తున్నారు. భారత్‌ను రక్షణ ఉత్పత్తుల హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.
ప్రతి రక్షణ ఒప్పందంలోనూ స్వదేశీ తయారీ కి పెద్దపీట వేయడం ద్వారా రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తున్నారు. విడిభాగాల తయారీ నుంచి అసెంబ్లింగ్ వరకు భారత్‌లోనే జరగడం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా, విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా అవుతుంది. దటీజ్ నరేంద్రమోదీ..




