గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్ 2022లో భారత్ చైనాను వెనక్కి నెట్టింది. ప్రపంచంలోనే మూడో బలమైన వైమానిక దళంగా అవతరించింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (WDMMA) ద్వారా చేసిన గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్ 2022 ప్రకారం, అమెరికా, రష్యా తర్వాత భారత వైమానిక దళం ప్రపంచంలో మూడవ బలమైన వైమానిక దళంగా ఉద్భవించింది. చైనా వైమానిక దళం మాత్రమే కాకుండా జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్, ఇజ్రాయెల్ వైమానిక దళం సహా ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్‌ను కూడా భారత వైమానిక దళం బలం అధిగమించిందని నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం WDMMA 98 దేశాలను ట్రాక్ చేస్తుంది.. 124 విమాన సేవలను కవర్ చేస్తుంది.. మొత్తం 47,840 విమానాలను అనుసరిస్తోంది.
ఇది వివిధ రకాల పారామీటర్ల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సైనిక విమానయాన సేవలను అంచనా వేస్తుంది, వాటి ప్రస్తుత బలాలు.. స్వాభావిక పరిమితులను సంగ్రహించి పూర్తి నివేదికను అందిస్తుంది.
అత్యధికంగా యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (USAF) కు TvR(ట్రూ వాల్యూ రేటింగ్) స్కోర్ లో 242.9 వచ్చింది. రష్యాకు TvR స్కోర్ 114.2 ఉంది, ఆ తర్వాత TvR స్కోర్ 69.4తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది. నివేదిక ప్రకారం భారత వైమానిక దళం (IAF) ప్రస్తుతం 1,645 క్రియాశీల విమానాలను కలిగి ఉంది.