భారత్ నాలో భాగమని…ఎక్కడున్నా…ఎక్కడికెళ్లినా దేశాన్ని తనతో తీసుకెళ్తానని గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ అన్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో…కుటుంబసభ్యుల సమక్షంలో … భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు పిచయ్. దేశపు మూడో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నందుకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉందన్న ఆయన భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Delighted to hand over Padma Bhushan to CEO @Google & Alphabet @sundarpichai in San Francisco.
Sundar’s inspirational journey from #Madurai to Mountain View, strengthening 🇮🇳🇺🇸economic & tech. ties, reaffirms Indian talent’s contribution to global innovation pic.twitter.com/cDRL1aXiW6
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) December 2, 2022