జనవరి 26 న జరగబోయే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి.
1) ఈ సంవత్సరం నుండి జనవరి 26 గణతంత్ర దినోత్సవం నేతాజీ జయంతి అయిన జనవరి 23 నుండి ప్రారంభమౌతుంది .
2) ఈసారి గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధ్య ఆసియా లోని ఐదు దేశాల అధినేతలను ఆహ్వానించడం జరిగింది. పోటీ ప్రపంచంలో చిన్న దేశాలకు అండగా నిలబడటం, అండదండలు అందించటం దేశ దౌత్య సంబంధాల నీతిలో కీలకమైన అంశం. ఒక ప్రక్క ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వైదొలగడం, రెండో ప్రక్క ఆసియా పై తన పట్టు బిగించడానికి చైనా బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్ట్ చేపట్టటం కారణాలతో మారుతున్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా మధ్య ఆసియా లోని దేశాలతో భారత్ పటిష్టమైన సంబంధాలు ఏర్పరుచుకోవడం ఒక చారిత్రక అవసరం, ఆదేశాలు
ఒకప్పుడు భారత్ లో అంతర్భాగం. ఆదేశాలతో భారత్ కు సుదీర్ఘ చారిత్రక , సంస్కృతిగా, ఆర్థిక, రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఆ దేశాలు మధ్య కాలంలో సోవియట్ యూనియన్ లో ఉండేవి. 1991 సంవత్సరం సోవియట్ రష్యా పతనం తర్వాత ఈ ఐదు దేశాలకు స్వతంత్రం వచ్చింది.మధ్య ఆసియా ప్రాంతం రష్యా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా మరియు దూర ప్రాచ్య దేశాల కూడలిలో ఆ దేశాలు ఉన్నాయి , పామిర్ పర్వతాలు మరియు అరల్ సముద్రం మధ్య లో ఉన్న ఈ ప్రాంతం శక్తి వనరులు సమృద్ధిగా ఉన్నాయి . ఆదేశాల సమస్యలు భారతదేశం కు సమస్యలే , కాబట్టి పరస్పర అవగాహనతో సహకరించుకోవడం ఎంతో అవసరంఉన్నది.
ఆదేశాలు
1) కజకిస్తాన్,
2) కిర్గిజ్స్తాన్
3)తజికిస్తాన్,
4) తుర్క్మెనిస్తాన్
5) ఉజ్బెకిస్తాన్, ఆ దేశాలతో భారతదేశానికి గడిచిన 30 సంవత్సరాలుగా మామూలు సంబంధాలున్నాయి ఆసందర్భంగా వార్షిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
2015 నుండి సాగిన ప్రయత్నాలు వివరాలు
సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి 2015 జూలై లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ అయిదు గణ రాజ్యాలలోపర్యటన చేశారు. 2021 సెప్టెంబర్ 17న షాంగై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలలో భారత ప్రధాని చేసిన ప్రసంగం లో మధ్య ఆసియా దేశాల మార్కెట్ లమధ్య వారధిగా వ్యవహరించటానికి భారత్ కట్టుబడి ఉన్నదని చెప్పారు.2021 సంవత్సరం నవంబర్ 10న ఐదు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల తో పాటు రష్యా ఇరానియన్ వాళ్లు కలిసి ఢిల్లీలో సమావేశాలు జరిగాయి ఆ సమావేశాలకు అజిత్ దోవల్ అధ్యక్షత వహించారు. ఆఫ్గనిస్తాన్ లో చోటుచేసుకొంటున్న పరిణామాలపై చర్చ జరిగింది. తీవ్రవాదం మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఎదుర్కోవడానికి ఉమ్మడి విధానం పై కూడా చర్చ జరిగింది. అట్లాగే 2021 డిసెంబర్ 19న విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఆ ఐదు దేశాల విదేశాంగ శాఖ మంత్రులకు ఆతిథ్యం ఇచ్చారు. ఆ సమావేశాలలో కలిసి పని చేయడానికి అంగీకరించారు. “కనెక్టివిటీ కార్యక్రమాలు పారదర్శకత, విస్తృత భాగస్వామ్యం, స్థానిక ప్రాధాన్యతలు, ఆర్థిక సుస్థిరత మరియు అన్ని దేశాల సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు గౌరవం వంటి సూత్రాలపై ఆధారపడి ఉండాలని వారు నొక్కిచెప్పారు” చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ పని విధానం ఆయా దేశాలను అప్పుల ఊబిలోకి లాగడం మరియు బకాయిలు చెల్లించనందుకు బదులుగాఆ ప్రాంతాలను మింగడం కోసం చైనా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న కుట్రలు తో ఆ దేశాలు భయాందోళనలో ఉన్నాయి అనేది స్పష్టంగా వ్యక్త మైనది. భద్రతకు సంబంధించినంతవరకు, భారతదేశం మరియు మధ్య ఆసియా దేశాలు రెండూ శాంతియుత, స్థిరమైన మరియు సంపన్నమైన పరిస్థితి కోసం ఆఫ్ఘనిస్తాన్ వ్యూహాత్మక దృక్కోణం చాలా ముఖ్యమైనదని గుర్తించాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి భౌగోళికంగా చాలా దగ్గరగా ఉంది, కానీ అది మూడు మధ్య ఆసియా దేశాలతో – తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్లతో తన సరిహద్దులను పంచుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగితే, మధ్య ఆసియా రిపబ్లిక్లు కూడా దాని అధీనంలోకి రావచ్చు. ఈ కారణంగా, భారతదేశం మరియు మధ్య ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సంయుక్త ప్రకటనలో, ఇది నొక్కిచెప్పబడింది.
మధ్య ఆసియా దేశాల సంబంధాలలో కీలకం ఆఫ్గనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ భౌగోళికంగా భారతదేశానికి చాలా దగ్గరగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తో మధ్య ఆసియా లోని తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్థాన్ లు సరిహద్దులను పంచుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగితే, అది భారత్ పైన మరియు మధ్య ఆసియా రిపబ్లిక్ ల పై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. సమాన సమస్యలున్న ఆ దేశాలతో పనిచేయటానికి భారత్ ముందుకు వస్తున్నది ఆ సందర్భంగా ఢిల్లీ లో జరిగిన మధ్య ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో సంయుక్త ప్రకటన చేసారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2593 (2021) ను వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా ఒకే స్వరంతో పునరుద్ఘాటించారు ఆ తీర్మానం ”ఆఫ్ఘనిస్తాన్ భూభాగం లో ఉగ్రవాదులకుఆశ్రయం, శిక్షణ మరియు కుట్ర వంటి ఉగ్రవాద కార్యకలాపాలకు ఆశ్రయం కల్పించకూడదు మరియు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులపై నియంత్రణ ఉండాలి , వారిని అణచివేయాలి . భారతదేశం మరియు మధ్య ఆసియా దేశాల మధ్య పరస్పర సమన్వయానికి ఇది ముఖ్యమైన అంశం,ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని బలోపేతం చేయాలని, సానుకూల దృక్పథాన్ని అనుసరించాలని అంతర్జాతీయ సమాజానికి సమావేశం పిలుపునిచ్చింది ఉగ్రవాద నిరోదానికి UN భద్రతా మండలిచేసే తీర్మానాలను పూర్తిగా అమలు చేయాలనే డిమాండ్ కూడా చేసారు. ఇట్లా భారత్ తనప్రయత్నం చేస్తుంటే మరోప్రక్క పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశా లు నిర్వహించింది. మధ్య ఆసియా దేశాలు భారత్ తో సంబంధాల కోసం ప్రాధాన్యత ఇస్తున్నది. ఇది మంచి పరిణామము. USకు వ్యతిరేకంగా చైనా మరియు రష్యాలు మధ్య ఆసియాలో పనిచేస్తుంటే భారతదేశం రష్యా మరియు USAలతో సంబంధాలలో సమతుల్యతకు ప్రత్యేక ప్రాముఖ్యత ను ఇస్తున్నది అలాగే షాంఘై సహకార సంస్థలో సభ్య దేశంగా కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ బాధ్యతాయుతమైన శక్తిగా తన పాత్రను నిర్వహిస్తున్నది . ఈ నేపథ్యం లో భారతదేశ 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐదు మధ్య ఆసియా దేశాధినేతలను ఆహ్వానించటం వ్యూహాత్మక బంధం యొక్క బలమైన భవిష్యత్తుకు సంకేతం.
Courtesy : NewsBharatiyam