కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి భారత్, డెన్మార్గ్. పరస్పర సహకారంతో ముందుకు వెళ్దామంటూ… కీలక రంగాలైన ఆరోగ్యం, వ్యవసాయం, జల నిర్వహణ, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఫలప్రదమైన చర్యలు జరిపినట్టు ఇరుదేశాల ప్రధానులు సమావేశానంతరం సంయుక్తంగా ప్రకటించారు. శాస్త్ర, సాంకేతిక రంగం, వాతావరణ మార్పులు, నైపుణాభివృద్ధి వంటి రంగాల్లో మరింత సహకారానికి నాలుగు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
భారత పర్యటనకు వచ్చిన ఆదేశప్రధాని ఫ్రెడెరిక్సెన్ తో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మోదీ. భారత్, డెన్మార్క్ మధ్య ‘గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’ ప్రగతిని తాము సమీక్షించామని, వివిధ రంగాల్లో సమగ్ర సహకారాన్ని మరింత విస్తృతం చేసేందుకు చర్చలు సాగించామని ఇరువురూ సంయుక్త మీడియో సమావేశంలో తెలిపారు. భారత్ లో వ్యవసాయ ఉత్పత్తుల పెగుదలకు సంబంధించిన సాగు రంగంలో సమర్ధవంతమైన సప్లయ్ చైన్, స్మార్ట్ వాటర్ రిసోర్సెస్ మేనేజిమెంట్, టెక్నాలజీ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.