అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) రాబోయే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ల కోసం 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఒరెగాన్లోని యూజీన్‌లో జూలై 15 నుంచి 24 వరకు జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఒరెగాన్ 22లో పాల్గొనే భారత జట్టులో ఒలంపిక్ గేమ్స్ జావెలిన్ త్రో బంగారు పతక విజేత నీరజ్ చోప్రా చోటు దక్కించుకున్నాడు. 22 మంది సభ్యులతో కూడిన జట్టులో 17 మంది పురుష అథ్లెట్లు, ఐదుగురు మహిళా అథ్లెట్లు ఉన్నారు. వ్యక్తిగత ఈవెంట్లలో పాల్గొనే 16 మంది అథ్లెట్లలో ఏడుగురు జాతీయ రికార్డు హోల్డర్లు అని AFI ప్రెసిడెంట్ అడిల్లే J సుమరివాల్లా తెలిపారు.
పురుషులు : అవినాష్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్‌చేజ్), ఎంపీ జబీర్ (400 మీటర్ల హర్డిల్స్), ఎం శ్రీశంకర్, మహ్మద్ అనీస్ యాహియా (లాంగ్ జంప్), అబ్దుల్లా అబూబకర్, ప్రవీణ్ చిత్రవేల్, ఎల్దోస్ పాల్ (ట్రిపుల్ జంప్), తజిందర్‌పాల్ సింగ్ తూర్ (షాట్ పుట్), నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్ (జావెలిన్ త్రో), సందీప్ కుమార్ (20 కిమీ రేస్ వాకింగ్), అమోజ్ జాకబ్, నోహ్ నిర్మల్ టామ్, మహమ్మద్ అజ్మల్, నాగనాథన్ పాండి, రాజేష్ రమేష్, మహమ్మద్ అనస్ యాహియా (4×400 మీ).
మహిళలు : ఎస్ ధనలక్ష్మి (200మీ), ఐశ్వర్య కైలాష్ మిశ్రా (400మీ), పరుల్ చౌదరి (3000మీ స్టీపుల్‌చేజ్), అన్నూ రాణి (జావెలిన్ త్రో), ప్రియాంక గోస్వామి (20కిమీ వాక్).