10 Principles of India-Africa Engagement!
July 25, 2018 న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఉగాండా పర్యటన సందర్భంగా ఉగాండా పార్లమెంట్ ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భాగంగా 10 Principles of India-Africa Engagement అనే పేరుని ఉటంకిస్తూ ముందు ముందు భారత్ – ఆఫ్రికా ల మధ్య 10 సూత్రాల మీద ఆధారపడి ఇరు దేశాలు పనిచేయాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించారు. దాని అర్ధమేమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది !
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ [HAL ] ఉగాండా ఎయిర్ ఫోర్స్ మధ్య జరిగిన ఒప్పందం ఆ పది ప్రిన్సిపల్స్ of india ఆఫ్రికా ఎంగేజ్మెంట్ లో భాగమే !
MoU కుదుర్చుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఉగాండా 12 ఏళ్ళ క్రితం రష్యా నుండి సుఖోయ్ Su-MK30 ఫైటర్ జెట్స్ ని కొన్నది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతున్నవేళ ఉగాండా ఎయిర్ ఫోర్స్ కి చెందిన Su-MK30 కి కావాల్సిన విడి భాగాలతో పాటు నిర్వహణ చేయడం కష్టంగా మారింది దాంతో ఉగాండా ఎయిర్ ఫోర్స్ HAL ని సంప్రదించింది విడి భాగాల కోసం మరియు నిర్వహణ కోసం. గత రెండు దశాబ్దాలుగా HAL భారతీయ వెర్షన్ అయిన Su-30 MKI లని అసెంబ్లింగ్ చేస్తున్నది దాంతో విడి భాగాలు కూడా మన దేశంలోనే తయారుచేసుకొని వాటిని అసెంబ్లింగ్ కోసం వాడుతున్నది. దీనిలో భాగంగానే ఉగాండా HAL ల మధ్య MoU కుదిరింది.
అయితే MoU ఎంత మొత్తానికి జరిగింది తెలియరాలేదు! కానీ HAL కి ఈ ఒప్పందం కొంచెం ఊరట కలిగించేదే అని చెప్పాలి. ఉగాండా ఎయిర్ ఫోర్స్ కి ఇచ్చిన సేవలు క్వాలిటీ కలిగి ఉంటె అప్పుడు మిగతా దేశాలు కూడా HAL ని సంప్రదిస్తాయి. ఉగాండా తో MoU అనేది HAL కి తోలి అడుగు అనే చెప్పాలి.
~ పార్ధసారధి పోట్లూరి


