భారతదేశం యొక్క డిజిటల్ ప్రయాణం నుండి వస్తున్న లాభాల గురించి “Stacking Up the benefits Lessons From India’s Digital Journey”అనే పేరుతో IMF ఒక వర్కింగ్ పేపర్ విడుదల చేసింది.
దానిలో పేర్కొంటూ..
” ఒక దశాబ్దం క్రితం, భారతదేశం యొక్క శక్తివంతమైన స్థానిక మార్కెట్లు బాగా చిరిగిన నోట్లతో వస్తువులను కొనుగోలు చేసే మరియు విక్రయించే వ్యక్తులతో నిండిపోయి ఉండేవి..కానీ, నేడు, వారు స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ ఫైనాన్స్‌లో పురోగతి అంటే దేశంలో ఎక్కడైనా తమ ఫోన్ల స్క్రీన్ పై కొన్ని ట్యాప్‌లతో అధికారిక మరియు అనధికారిక ఆర్థిక వ్యవస్థలోని కోట్ల మంది ప్రజలు తమ చెల్లింపులను స్వీకరించవచ్చు, ఇన్వాయిస్లను సెటిల్ చేసుకోవచ్చు మరియు నిధులను బదిలీ చేయవచ్చు.”
అని పేర్కొంటూ…

Image : Mint
**భారతదేశం “ప్రపంచ స్థాయి” డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించింది.
**భారతదేశం తనుఅనుకున్న అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI) ను అభివృద్ధి చేసింది అని IMF పేర్కొంది.. డిజిటల్ ఇన్ఫ్రా అభివృద్ధి చేద్దాం అనుకునే దేశాలకు ఇది మార్గదర్శకంగా ఉంటుంది అని పేర్కొంది. మిగతా దేశాలు భారత్ ను చూసి నేర్చుకోవాలి అని చెప్పింది.
** ఈ డిజిటలైజేషన్ భారత ఆర్థిక వ్యవస్థ ఫార్మలైజేషన్ కి సహకరిస్తోంది. (అంటే ఆర్ధిక వ్యవస్థ వెలుపల జరిగే ఆర్ధిక వ్యవహారాలు ఆర్ధిక వ్యవస్థ లోపల జరగడం.)
** ఆధార్ వ్యవస్థ లబ్ధిదారులకు చెల్లింపులను నేరుగా బదిలీ చేయడంలో సహాయపడుతూ లీకేజీలను అరికట్టింది.
** ఈ డిజిటల్ వెన్నెముకను ఉపయోగించడం వల్ల భారతదేశం తన వ్యాక్సిన్ డెలివరీని త్వరగా పెంచడానికి మరియు పెద్ద ఎత్తున అంతర్గత వలసలు వంటి సవాళ్లను అధిగమించడానికి అవకాశం కల్పించింది అని ఈ పేపర్ పేర్కొంది.
** డీమోనిటైజేషన్ UPIతో సహా ఇతర రకాల చెల్లింపుల విధానం ఉపయోగించడానికి దారితీసిందని, ఈ డిజిటల్ చెల్లింపులు మొత్తం చెల్లింపు లావాదేవీలలో ఇప్పుడు వాల్యూమ్ వారీగా 68 శాతం వాటాను కలిగి ఉందని పేపర్ పేర్కొంది.
….చాడా శాస్త్రి….


