మరో లవ్ జిహాద్ ఉదంతం తాజాగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుండి వెలుగులోకి వచ్చింది.
ఈ ఇఖ్లాష్ ఒక హిందూ మహిళను ఆకర్షించడానికి మనోజ్ అని హిందూ పేరు పెట్టుకుని పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆ మహిళపై అభ్యంతరకర వీడియోను కూడా రూపొందించి డబ్బు వసూలు చేసేందుకు బ్లాక్ మెయిల్ చేశాడు.
ఈ అమ్మాయి 2019లో ఆన్లైన్లో ఇఖ్లాష్ను కలుసుకుంది. అతను మనోజ్‌గా పరిచయం చేసుకుని గురుగ్రామ్‌లోని GD గోయెంకా విశ్వవిద్యాలయంలో చదువుతున్నానని ఆమెకు చెప్పాడు. రెగ్యులర్ గా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో, ఇఖ్లాష్ డెహ్రాడూన్‌ను అనేకసార్లు సందర్శించాడు మరియు ఆమెను శారీరక సంబంధానికి బలవంతం చేశాడు. కాలేజీ పూర్తికాగానే పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాట ఇచ్చాడు.
ఆ టైం లోనే ఇఖ్లాష్ ఆమె నుండి డబ్బు అడగ్గా ఆమె ఆన్లైన్ ద్వారా సొమ్ముబదిలీ చేసింది. కొన్ని రోజుల తర్వాత తనకు అనారోగ్యంగా ఉందని, ఇంకా డబ్బు కావాలని ఆమెతో చెప్పాడు.
సెప్టెంబరు 2020లో, బాధితురాలికి అనుమానం వచ్చి వాస్తవాన్ని తెలుసుకోవడానికి అతని ఊరు వెళ్తే, అతను ఆమెను ఒక హోటల్‌కి తీసుకెళ్లి, ఇఖ్లాష్ అని అసలు పేరు ముద్రించిన తన IDని ఆమెకు చూపించాడు. దాంతో ఆమె డెహ్రాడూన్‌కు తిరిగి వచ్చింది. ఈమెకు సంబంధించిన లైంగిక వీడియోలు ఉన్నాయని, వాటిని ఆన్లైన్లో ప్రచురిస్తానని చెప్పి ఇఖ్లాష్కి బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. డబ్బు వసూలు చేస్తూ తనతో శారీరక సంబంధాలు కూడా పెట్టుకోవాలని బ్లాక్ మెయిల్ చేశాడు.
మే 17న ఆ మహిళ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఇఖ్లాష్ తనని వీడియోల తో బ్లాక్ మెయిల్ చేసి తన నుంచి సుమారు రూ.5 లక్షలు తీసుకున్నట్లు ఇఖ్లాష్పై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 376, 419 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇఖ్లాష్ను మే 19న హతీన్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని హతీన్ కాలనీ నుండి హర్యానాలోని పాల్వాల్ జిల్లా నుండి అరెస్టు చేశారు. శనివారం అతడిని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తరలించారు.
తదుపరి విచారణ కొనసాగుతోంది.
దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇన్ని వందల కేసులు బయట పడుతున్నా, ఇటువైపు హిందూ సెక్యూలర్స్ ఈ వార్తలను చాప క్రిందకు తోసేయ్యడానికి ప్రయత్నిస్తూ నిందితులకు పరోక్షంగా మద్దతు ఇస్తూ ఉంటే అటువైపు పెద్దలు ఎవరూ అసలు ఈ సంఘటనలను ఖండించడం కానీ ఇలా చేయడం తప్పు అని కానీ చెప్పడం లేదు.
….చాడా శాస్త్రి….