ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో మహాకాళ్ కారిడార్ ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. అంతకుముందు సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న మోదీ మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహాకాళ్ లోక్ ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. శివుడే జ్ఞానం, జ్ఞానమే శివుడని ఆయన అన్నారు. భారతీయులందరం బానిస మనస్తత్వాన్ని వదిలి భారత వారసత్వాన్ని తలుచుకుంటూ గర్వపడాలన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం వేగంగా సాగుతోందన్న ఆయన… కాశీ కారిడార్ ను ఇటీవలే పూర్తి చేశామని..ఇప్పుడు మహాకాళ్ లోక్ ను జాతికి అంకితం చేయడం గర్వంగా ఉందని అన్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాసహా పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
https://twitter.com/narendramodi/status/1579862070564376577?s=20&t=mnvQnWDH51MYLCkbh4PAhA
https://twitter.com/narendramodi/status/1579841366598746113?s=20&t=mnvQnWDH51MYLCkbh4PAhA