రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఇతర అత్యవసర సమయాలలో 108 సర్వీస్ ఆపద్బాంధవులా ఉపయోగపడుతున్నది. ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు 108 నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా సహాయం పొందవచ్చు. పండగలు వీకెండ్స్ ను పురస్కరించుకుని 108 సర్వీస్ నిర్వాహకులు పత్రిక ప్రకటన విడుదల చేశారు.
వీకెండ్ సమయంలో మద్యం తాగి వాహనాలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని ఈ ప్రకటనలో తెలియజేశారు. మద్యం తాగి వాహనం నడపడం నేరమని గుర్తు చేశారు. ఇటువంటి వాహనాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫలితంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలియజేశారు. మద్యం తాగినప్పుడు వాహనం నడిపేందుకు ప్రయత్నించ రాదని,, ఇతర మార్గాలలో ప్రయాణం చేయడం మేలు అని సూచించారు.
రోడ్డు ప్రమాదాలు గమనించినప్పుడు వెంటనే నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రమాదాల సమయంలో సహాయం చేసేందుకు 24 గంటలు పని చేస్తున్నట్లు వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలోని ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, రాష్ట్ర సీఈవో ఖలీద్ ఈ పత్రిక ప్రకటనను విడుదల చేశారు.