చొక్కా విప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే హల్చల్.. వారం రోజులు సస్పెండ్ చేసిన స్పీకర్.
ఉన్నత పదవిలో ఉన్న విషయాన్ని మర్చిపోయి అసభ్యంగా ప్రవర్తించారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీనిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యేను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక అసెంబ్లీలో గురువారం నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన బీకే సంగమేష్ సమావేశం జరుగుతున్న సమయంలో చొక్కా విప్పి హల్చల్ చేశారు. దీంతో స్పీకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే తీరును తప్పుబట్టి.. వారం రోజుల పాటు ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సభను వాయిదా వేశారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
కాగా, లోక్సభ ఎన్నికలతో పాటు.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని యెడ్డీ సర్కార్ భావిస్తోంది. దీనిపై తీర్మానం కోసం అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీజేపీ ప్రతిపాదనను తవ్యతిరేకిస్తూ.. హంగామా సృష్టించారు.