ఇస్లామిక్ దేశాల్లో ఎర్రజెండా ఎగరదు.. కమ్యూనిస్టు పాలనలో ముస్లింలకు స్వేచ్ఛ లేదు
భారత దేశంలో, ముఖ్యంగా జాతీయ వాదులపై ఆరోపణల దాడికి అటు కమ్యూనిస్టులు ఇటు ముస్లిం మైనారిటీ నాయకులు పోటాపోటీగా ప్రయత్నిస్తుంటారు. ఈ రెండు వర్గాల వారూ ఎక్కడా లేనంత స్నేహాన్ని చాటుతుంటారు. వాస్తవానికి ఇతర దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఇస్లామిక్ దేశాల్లో కమ్యూనిజానికి చోటు లేదు. ఎర్ర జెండా ఎగిరే అవకాశం లేదు. గల్ఫ్ దేశాల్లోనే కాదు, మనతో పాటు స్వాతంత్ర్యం పొందిన పాకిస్తాన్ లోనూ అదే పరిస్థితి. ఇక, ఎర్రజెండా పాలన ఉన్న దేశాల్లో ముస్లింలకు కనీస స్వేచ్ఛ ఉండదు. కనీసం మనుషుల్లా బతికే అవకాశం ఉండదు.
చైనాలో యుగర్ ముస్లింలను జంతువుల్లా చూస్తున్నారు. వాళ్లను డిటెన్షన్ సెంటర్ పేరుతో జైళ్లలో బంధించారు. దాదాపు 3000 మసీదును కూల్చివేశారు. ఇల్లు, దుకాణం మీద నెలవంత గుర్తు గానీ ఆకుపచ్చ జెండా గానీ ఉంటే ఇంతే సంగతులు. ముస్లిం పురుషులను వెట్టి చాకిరీ బానిసలుగా చైనా ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతుందని ఆరోపణలు వచ్చాయి. ముస్లిం మహిళలు పిల్లలకు జన్మనివ్వకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తున్నారట. మహిళలను కూడా బానిసలుగా అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చైనాకు సమీపంలోని ఉత్తర కొరియాలోనూ అంతే. కనీసం అక్కడ ఒక మసీదు లేదు. ఉత్తర కొరియా రాజధానిలోని ఇరాన్ రాయబార కార్యాలయ ఆవరణలో ఆ దేశం ఒక మసీదు నిర్మించింది. ఇది మినహా ఆ కమ్యూనిస్టు దేశంలో మైనారిటీల ప్రార్థన స్థలం అనేదే లేదు.
క్యూబా కూడా చాలా కాలంగా ఎర్రజెండా ఏలుబడిలో ఉన్న దేశం. అక్కడ కూడా ముస్లింలకు కనీస స్వేచ్ఛ లేదు. మానవహక్కులు లేవు. మసీలు నిర్మించుకునే స్వేచ్ఛ లేదు. కొన్ని దశాబ్దాల పాటు అక్కడ మసీదు నిర్మాణం నిషిద్ధం. కొన్నేళ్ల క్రితం ఈ నిషేధాన్ని మాట వరుసకు ఎత్తివేశారు. దరఖాస్తు చేస్తు అనుమతి ఇస్తామన్నారు. కానీ ఆ అనుమతి రావడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంది. అంటే మైనారిటీలకు మత స్వేచ్ఛ గురించి భారత దేశంలో మాట్లాడినా, ఎర్రజెండా నీడన మానవ హక్కులు లేవని అర్థమవుతుంది.
ప్రపంచంలో 50 ముస్లిం దేశాలున్నాయి. ఈ దేశాల్లో ఇస్లాం అధికారికి మతం. ఆ మతానికే తొలి ప్రాధాన్యం. అలాంటి దేశాల్లో ఎక్కడా లాల్ సలాం అనే మాట వినిపించదు. ఎర్ర జెండా కనిపించదు. కమ్యూనిస్టులకు అవకాశం లేదు. భారతదేశంలో మాత్రం ప్రతి ఒక్కరికీ అపరిమితమైన హక్కులు, అధికారాలు ఉన్నాయి. కాబట్టి వీళ్లు ఈ దేశానికి జేజేలే పలకాలి కదా. మేరా భారత్ మహాన్ అని కామ్రేడ్లు ఎందుకు నినాదం చేయరో అర్థం కాదు.