ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ మీద బిజెపి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ విజయం సాధించారు.
గత ఎన్నికలను 2004 నుండి పరిశీలించినట్లయితే ఏ ఒక్క పార్టీ కూడా అదిలాబాదులో రెండోసారి గెలవడం ఇప్పటివరకు జరగలేదు కానీ ప్రస్తుతం బీజేపీ ఆ రికార్డును బద్దలు కొట్టినట్లు అయింది.
ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఏడు నియోజకవర్గాలలో ఆరు నియోజకవర్గాలలో బీజేపీ ఆదిపత్యాన్ని సాధించింది.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బిజెపి రెండో స్థానంలో నిలిచింది.
ప్రత్యేకంగా ఆదిలాబాద్ నియోజకవర్గ మీద మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టిని పెట్టిన బిజెపి విజయకేతనం ఎగురవేసింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 7 నియోజకవర్గాలను పరిశీలించినట్లయితే అదిలాబాద్ జిల్లాలో పోలైన ఓట్లు 12,36,438 ఇందులో బిజెపికి అభ్యర్థి నగేష్ కి వచ్చిన ఓట్లు 5,68,168 ,కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు వచ్చిన ఓట్లు 4,77,516 ఓట్లు,భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి ఆత్రం సక్కు కి వచ్చిన ఓట్లు
1,37,300 వచ్చాయి.
బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ పైన 90,652 మెజారిటీతో గెలుపొంది మళ్ళీ అదిలాబాద్ లో కాషాయ జెండా ఎగురవేశారు.
అదిలాబాద్ జిల్లాలో 7 నియోజకవర్గాల ఫలితాలను ఒకసారి విశ్లేషిస్తే ముందుగా
1) సిర్పూర్ కాగజ్ నగర్:
సిర్పూర్ కాగజ్ నగర్ లో బిజెపి కి 8369 ఓట్ల ఆధిక్యం సాధించింది ఇక్కడ బీజేపీ ఎంఎల్ఏ పాల్వాయి హరీష్ బాబు ఉండడం బిజెపికి లాభం చేకూరింది అలాగే బెంగాలీ ఓట్లు బిజెపికి పడడం కూడా మెజార్టీ రావడానికి ఒక కారణం అయ్యింది అని చెప్పొచ్చు,
కాంగ్రెస్ రెండవ స్థానం లో ఉంది.
2) ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ లో భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగుణ 26,940 ఓట్ల మెజారిటీ సాధించింది.
ఆసిఫాబాద్లో బిజెపి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
కొంతమేరకు అదిలాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్క అదిలాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ చేసుకోవాలి అని విశ్వ ప్రయత్నాలు చేసినా ఆసిఫాబాద్ లో మాత్రమే కాంగ్రెస్ మెజార్టీ సాధించింది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
3) ఖానాపూర్ :
గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రాథోడ్ రమేష్ పైన వెడ్మా బొజ్జు గెలిచి అందరి అంచనాలు తలకిందులు చేసిన ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నప్పటికీ బిజెపి అభ్యర్థి గోడం నగేష్ ఖానాపూర్ లో 13,519 ఓట్ల మెజార్టీ సాధించారు,
ఖానాపూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు వేసినటువంటి ఓటర్లు ఈసారి బిజెపి వైపు చూశారు.
4) అదిలాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో అదిలాబాద్ నియోజకవర్గంలో హోరాహోరీగా సాగిన చివరికి పాయల్ శంకర్ బిజెపి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బిజెపి మధ్య తీవ్ర పోటీ జరిగి ఎంపీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి 5338 ఓట్లు రావడం జరిగింది.
ఎంతో ఆశపెట్టుకున్న కాంగ్రెస్ కే నిరాశే దక్కింది.
5) బోథ్: గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మొత్తంలో ఉత్తర తెలంగాణ బిజెపికి ఊపిరి పోసింది.
అలాంటి పరిస్థితిలో బోథ్ నియోజకవర్గంలో బిజెపి గెలిచే పరిస్థితి ఉన్న స్వయంకృతాపరాధం వల్ల భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి అనిల్ జదవ్ పైన సోయం బాపూరావు ఓడిపోవడం జరిగింది.
పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసింది.
బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆదిక్యత కనపరచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికిని అలాగే అదిలాబాద్ ఇన్చార్జ్ మంత్రివర్యురాలు సీతక్క ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ 4914 మెజారిటీ రావడం కమలనాథుల్లో ఉత్సాహాన్ని నింపింది.
బోథ్ నియోజకవర్గంలో ఆదివాసి ఓట్ల చీలిక జరిగిన బిజెపికి ఆధిక్యత రావడం కొంత బీజేపీ శ్రేణులకు ఆనందాన్నిచ్చింది.
మళ్లీ ముఖ్యంగా బిజెపి ఎంపీ అభ్యర్థి ఈ నియోజకవర్గానికి చెందినవాడు కావడం కూడా కొంత ప్రభావం చూపించింది.
హిందుత్వ వాదులు,సైలెంట్ ఓట్లు కూడా బీజేపీ కి పడ్డాయి.
6) నిర్మల్ : అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ దురంధరుడు అయిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నీ ఓడించి బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి అద్వితీయమైన మెజార్టీతో గెలిచారు .
ఎంపీ ఎన్నికలకు ముందు ఐకే రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లిన కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసినా అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే నిర్మల్ నియోజక వర్గం
43,570 ఓట్ల అత్యధిక మెజార్టీతో బిజెపి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
నిర్మల్ నియోజకవర్గం లోని అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలు ఇక్కడ హిందుత్వ వాదులను ఆలోచింప చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిర్మల్ నియోజక వర్గంలో 40,000 పైన మెజారిటీ బీజేపీ సాధిస్తుందని ముందుగానే చెప్పినట్టుగానే నిజం అయ్యింది.
7) ముధోల్ :
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ ఎటువైపు చూపు తిప్పకుండా చేసిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే ముధోల్ నియోజకవర్గం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుండి రామారావు పటేల్ భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన విఠల్ రెడ్డి పైన గెలిచారు.
ఈసారి కూడా బిజెపికి ఆధిక్యత విషయములో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రెండవ నియోజకవర్గంగా ముధోల్ ని చెప్పవచ్చు.
ముధోల్ నియోజకవర్గంలో బిజెపి ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పైన 37,833 ఓట్ల మెజార్టీ సాధించింది.
ముధోల్ నియోజకవర్గములో కాషాయ వాదుల ఏకీకరణ, జాతీయవాదుల మద్దతు గణనీయంగా పెరిగింది,అలాగే హనుమాన్ స్వాముల అరెస్టు కూడా ప్రభావం చూపించింది అని చెప్పొచ్చు.
గతంలో పలు పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 35000 వేల మెజారిటీ ముధోల్ లో వస్తుందని చెప్పి అనుకున్నట్టుగానే చెప్పిన మెజార్టీ కంటే ఎక్కువే రావడంతో ముధోల్ బీజేపీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అలాగే అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి లక్ష మెజార్టీతో గెలవబోతుందని తెలియజేసి 90000 పైన ఓట్లతో బీజేపీ విజయం సాధించడం అదిలాబాదులో బీజేపీ మరింత పట్టును సాధించిందని చెప్పవచ్చు.
ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లిన తమ ప్రభావాన్ని చూపించలేదని తెలుస్తుంది.
ఉమ్మడి అదిలాబాదు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలలో నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు ఉండడం కలిసి వచ్చిందని చెప్పవచ్చు.
కాంగ్రెస్ కి ఒక ఎమ్మెల్యే, ఇద్దరు తెరాస ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా బిజెపి తమ ప్రభావాన్ని చూపించింది.
ఉత్తర తెలంగాణలో నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు ఉండగా ప్రస్తుతం ఎంపీ కూడా తోడవడంతో అదిలాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ తన పట్టునీ నిలుపుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
– మునిగెల శ్రీధర్