పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తన మేనల్లుడి పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఆమె కారుపై దుండగులు కాల్పులు జరిపారు. వాళ్లు మోటార్ బైక్ పై వచ్చారని ఆమె అన్నారు. దాడిపట్ల ఆందోళన వ్యక్తం చేసిన రేహమ్… ఇమ్రాన్ పై విరుచుకుపడ్డారు. ఇదేనా మీరు చెప్పే నయా పాకిస్తాన్. హంతకులు, గూండాల దేశంగా పాకిస్తాన్ మారిపోయింది అని వ్యాఖ్యానించారు. రేహమ్ పై కాల్పులు జరిగిన సమయంలో కార్లో ఆమె డ్రైవర్ తో పాటు వ్యక్తిగత కార్యదర్శి ఉన్నారు.
బ్రిటీష్- పాకిస్తానీ సంతతికి చెందిన జర్నలిస్ట్ అయిన రేహమ్ ను ఇమ్రాన్ 2014లో పెళ్లిచేసుకున్నారు. తరువాత ఏడాదే ఇద్దరూ విడిపోయారు. నాటి నుంచి మాజీ భర్తపై ఏదో ఒక సందర్భంలో విమర్శలు చేస్తూ వస్తున్నారు రేహన్. పుల్వామా దాడి సందర్భంగా…ఇమ్రాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మ అనీ మండిపడ్డారు రేహమ్.
On the way back from my nephew’s marriage my car just got fired at & two men on a motorbike held vehicle at gunpoint!! I had just changed vehicles.
My PS & driver were in the car. This is Imran Khan’s New Pakistan? Welcome to the state of cowards, thugs & the greedy!!— Reham Khan (@RehamKhan1) January 2, 2022
You know me!! I would prefer a duel not a cowardly covert attempt. https://t.co/emYA0XUkQ2
— Reham Khan (@RehamKhan1) January 2, 2022