బ్రిటన్ ప్రధాని పదవి పోటీలో భారత సంతతికి చెందిన రుషి సునక్ ముందున్న సంగతి తెలిసిందే. కన్సర్వేటివ్ పార్టీనుంచి మొత్తం 8మంది పోటీలో ఉన్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్టర్లో షేర్ చేసిన మీమ్ ఆకట్టుకుంటోంది. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో ఆ మీమ్ ద్వారా చూపంచారు.
https://twitter.com/anandmahindra/status/1546878479970766848?s=20&t=njz-E_xZhQz5k5XEzZSi6A
భవిష్యత్తులో 10 డౌనింగ్ స్ట్రీట్ ఇది…పూర్తి భారతీయతతో నిండి ఉంటుంది అని అందులో ఉంది. అందులో బ్రిటన్ ప్రధాని నివాసం పూర్తి హిందూ సంప్రదాయబద్దంగా అలంకరించి ఉంది. గుమ్మానికి మామిడి తోరణాలు, స్వస్తిక్ చిహ్నాలున్నాయి. ఆధ్యాత్మికతకు, దైవత్వానికి ప్రతీకగా అక్కడి వాతావరణ ఉంది.
రుషి భారతీయ మూలాలున్నవాడు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి స్వయానా అల్లుడు. ప్రధానిగా ఆయనకు చాలామంది సీనియర్ల మద్దతుంది. బ్రెగ్జిట్ అనుకూల నేతగా రుషికే అవకాశాలున్నాయని చెబుతున్నారు.