వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తెలంగాణగవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారుపై ఆమె గవర్నర్ కుఫిర్యాదు చేశారు. అంతేకాదు రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయన్నా నమ్మకు తమకు లేదని షర్మిల అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా గూండాలేనని నోటికి హద్దూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని గవర్నర్ తో భేటీ అనంతరం షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని పోలీసులు కేవలం అధికార పార్టీతోనే ఫ్రెండ్లీగా ఉంటున్నారనీ ఆమె ఆరోపించారు. సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఎవర్నీ అరెస్ట్ చేయలేదనీ ఆమె గుర్తుచేశారు.