కుల గణన పేరుతో మజ్లిస్ పార్టీ అజెండాను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే కుల గణన పేరుతో ప్రభుత్వం హడావుడి చేసింది తప్పితే, నికరంగా బీసీ లకు ఎటువంటి మేలు తలపెట్టలేదు. పైగా రాజకీయ పదవుల్లో 42 శాతం టిక్కెట్లు ఇస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇతర పార్టీలు కూడా ఈ సవాల్ కి కట్టుబడాలని పిలుపు ఇచ్చారు. దీని వెనుక పెద్ద కుట్ర కనిపిస్తోంది.
….
వాస్తవానికి భారతీయ సమాజంలో కుల వ్రత్తులను అంటిపెట్టుకుని ఉన్న వర్గాలుగా బీసీలు నిలుస్తారు. సరైన ఆదాయాలు లేకపోయినా తర తరాలుగా సంస్క్రతికి కట్టుబడి ఉండిపోయారు. ఇటువంటి తరగతులను వెనుకబడిన తరగతులుగా రాజ్యాంగం గుర్తించింది. అందుచేత ఈ వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కోటాను అమలు చేస్తూ వచ్చారు. కానీ ముస్లింలను బీసీలుగా నిర్ణయించేందుకు ఎటువంటి కొలమానం లేనే లేదు.
…
సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ మార్కు రాజకీయం బయట పడింది. కుల గణన పేరుతో హడావుడి చేసి మజ్లిస్ పార్టీ అజెండాను ప్రజల మీద రుద్దేశారు. ఇందులో భాగంగా తెలంగాణ లో 12 శాతం దాకా ముస్లింల జనాభా ఉందని తేల్చారు. కానీ ఇందులో పది శాతం పైన ముస్లిం బీసీలు ఉన్నారని లెక్కలు చూపించారు. అకస్మాత్తుగా ముస్లింలను బీసీలుగా మార్చేందుకు ఎటువంటి విధానమూ అవలంబించ లేదు. అంటే, రాజకీయ నాయకులు చూపించిన జనాలు అందరికీ బీసీ హోదా కల్పించేశారన్న మాట.
…
కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ ఎత్తుగడలకు ఒక ఉదాహరణ చూడవచ్చు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేది. అప్పట్లో బీసీ లకు రిజర్వ్ చేసిన సీట్లలో వెనుకబడిన తరగతుల అభ్యర్థులు పోటీ చేసి రాజకీయ సేవ చేసేవారు. దీంతో పాతబస్తీకి చెందిన కొద్ది సీట్లలో ముస్లిం కార్పొరేటర్స్ ఉండేవారు కానీ, ముస్లింల లోని కొన్ని వర్గాలను ఈ కోటాలో ఇరికించటంతో ఈ బీసీ సీట్లను పెద్ద ఎత్తున ముస్లింలు కొల్లగొట్టేశారు. గతంలో జీ హెచ్ ఎమ్ సీ లో 10, 12 మంది మాత్రమే ముస్లిం కార్పొరేటర్లు ఉండగా, ఇప్పుడు దాదాపు 40 కి పైగా ముస్లింలు బీసీ కోటా పేరుతో పదవులు లాగేసుకున్నారు.
…
కేవలం 2,3 శాతం మందిని బీసీల్లో పెడితేనే ఈ స్థాయిలో కబ్జా జరిగింది. మరి, రాష్ట్ర జనాభాలోని 10 శాతం మంది ముస్లింలను బీసీలుగా మార్చేస్తే, గ్రేటర్ హైదరాబాద్ లో సగం సీట్లను లాగేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక్క గ్రేటర్ లోనే కాదు, అనేక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ముస్లిం రాజ్యంగా మారిపోతాయి. రాజకీయంగా కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల గుప్పిట్లోకి వెళ్లిపోతాయి.
..
ఈ ఉద్దేశ్యంతోనే కుల గణన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి .. రాజకీయ సవాల్ విసిరారు అని తెలుస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఈ ట్రాప్ లో పడినట్లయితే, తెలివిగా బీసీ సీట్లను టోకుగా ముస్లింలకు కట్టబెట్టడమే కాంగ్రెస్ మరియు మజ్లిస్ పార్టీల కుట్రగా తెలుస్తోంది.