హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రభావం రాష్ట్రమంతటా పడుతోంది. దళితబంధు హామీ ఇతర ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ ఆయా నియోజకవర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..సోషల్మీడియా లోనూ ట్రోల్ చేస్తున్నారు. ఇక భువనగిరి సహా పలుప్రాంతాల్లో ఏకంగా హోర్డింగులు వెలిశాయి. భువనగిరి ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చి సీఎం వరాల హామీలు ఇస్తారని గూడూరు నారాయణరెడ్డి పేరుతో ఉన్న హోర్డింగ్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి.