తమిళనాడులో దళిత హిందూ మహిళను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నించినందుకు, ఆమె నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇమాన్ హమీఫ్ అనే 21 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో బాధితురాలితో స్నేహం చేశాడు.కొంతకాలంగా ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఓరోజు ఆమెకు తెలియకుండా అమ్మాయి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకుని ఆమె ఇన్స్టాగ్రామ్ లో వారి సన్నిహిత చిత్రాలను పోస్ట్ చేశాడు. బాధితురాలి నగ్న చిత్రాలను ..ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులకు Whatsapp ద్వారా పంపాడు. ఇస్లాంలోకి మారకుంటే మరిన్ని చిత్రాలను పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అంతేకాదు బాధితురాలిని హిజాబ్ ధరించి శుక్రవారాల్లో ప్రార్థన చేయమని బలవంతం చేశాడు. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. మదర్సాలో చేర్పిస్తానని చెప్పాడు. అందుకామె వ్యతిరేకించింది. అని మహిళా చెప్పింది.
నిందితుడు తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చి తనపై దాడి చేసేవాడని బాధితురాలు తెలిపింది. తన తండ్రికి అనారోగ్యంగా ఉందని చెప్పి ఆమె బంగారు చెవిపోగులు కూడా చేసుకుని తాకట్టు పెట్టాడని తెలిసింది. అంతేకాదు ఆమెను కులంపేరుతో దూషించేవాడు.
ఇమాన్ తిరుపూర్‌లోని స్థానిక బనియన్ల తయారీ యూనిట్లో పనిచేస్తున్నాడు.
నేను నా మతాన్ని మార్చుకోవడానికి నిరాకరిస్తే దళితురాలైన నీకు అంత పొగరెందుకని తిట్టాడని బాధితురాలు వాపోయింది. అంతేకాదు తన తల్లిదండ్రులకు, బంధువులకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పింది. నిత్యం శారీరక, మానసిక వేధింపులకు గురైన ఆమె.. మే 5న తిరుపూర్‌లోని నల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి తిరుపూర్ జిల్లా జైలుకు రిమాండ్ చేశారు.