తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం యశోద హాస్పిటల్ లో చేరారు. వైద్యులు ఆయనకు గుండె, కరోనరీ యాంజియోగ్రామ్ యాంజియోగ్రామ్, సిటీస్కాన్ పరీక్షలు చేశారు. రక్త పరీక్షల్లో ఎలాంటి సమస్య లేదని తేలింది.. బ్రెయిన్ MRI టెస్ట్ చేశారు. ఆయన ప్రతి ఏటా ఫిబ్రవరి లో రెగ్యులర్ చెకప్ చేసుకుంటుంటారు. అయితే రెండ్రోజులుగా కాస్త నీరసంగా ఉండడం…. ఎడమ చెయ్యి, ఎడమ కాలు లాగుతోందని చెప్పడంతో ప్రివెంటివ్ చెకప్ చేయించారు.రిపోర్టులను బట్టి చికిత్స ఉంటుందని వైద్యులు తెలిపారు.
సీఎంతో అయన భార్య శోభ, కుమార్తై కవిత, సంతోష్, మనవడు హిమాన్ష్ ఆస్పత్రికి వెళ్లారు. తరువాత కేటీఆర్, హరీష్ రావు కూడా ఆస్పత్రికి చేరుకుని ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరాతీశారు. ఆస్పత్రిలో చేరడం వల్ల కేసీఆర్ ఇవాల్టి యాదగిరిగుట్ట పర్యటన రద్దైంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)