ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు మరోసారి హత్య బెదిరింపు వచ్చింది. లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్ లోని హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్ కు ఆగస్టు 2న యూపీ సీఎంను బాంబు పెట్టి చంపేస్తామని బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో హెల్ప్‌లైన్ ఆపరేషన్ కమాండర్ సుభాష్ కుమార్ సుశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు వెంటనే సన్నద్ధమై విచారణ ప్రారంభించారు. సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితులను కనిపెట్టి అరెస్ట్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని లక్నో పోలీసులు తెలిపారు. సైబర్ సెల్, నిఘా బృందాలు కూడా దీనిపై కసరత్తు చేస్తున్నాయని చెప్పారు.