సంగీత దర్శకుడు మ్యూజిక్ మాస్ట్రోను రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్రం. ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్, పరుగులరాణి పీటీ ఉష కూడా నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదిగ్గా వెల్లడించారు మోదీ. విభిన్న రంగాల్లో రాణిస్తూ దేశానికి ఖ్యాతి తెచ్చిన 12 మందిని రాష్ట్రపతి ఎగువసభకు నామినేట్ చేయవచ్చు. కర్ణాటకకు చెందిన వితరణ శీలి, ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్దేను కూడా రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు.