లవ్ జిహాద్.. పేరులోనే క్రూరత్వం నింపుకొన్న కాన్సెప్ట్ ఇది. అమాయకులైన హిందూ బాలికలను వలలో వేసుకొని, పెళ్లి పేరుతో జీవితాలను చిదిమేసే మార్గం ఇది. ఆ తర్వాత మతం మార్చి, జీవితాలను మార్చేయటం జరుగుతూ ఉంటుంది. చాలా లవ్ జిహాద్ కేసులలో ఎదురు తిరిగిన బాలికలను చంపేయటం మాత్రం విషాదమే.
ఇన్ని దారుణాలు జరుగుతున్నా, మన ప్రభుత్వాలు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నాయి. మహారాష్ట్రలో ఇటీవల కొలువు దీరిన ఫడ్నవీస్ ప్రభుత్వం మాత్రం .. లవ్ జిహాద్ మీద ఉక్కు పాదం మోపాలని నిర్ణయం తీసుకొంది. ఇందుకు అనుగుణంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొని రావాలని, ఇందుకు తీసుకోవాల్సిన విధి విధానాలపై ఈ కమిటీ పనిచేస్తుంది. దీని మీద అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో స్త్రీ శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం శాఖల కార్యదర్శులు, హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి ఉన్నారు.
ప్రభుత్వ తీర్మానం ప్రకారం.. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. ‘లవ్ జిహాద్’, బలవంతపు మతమార్పిడి ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుంది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో చేసిన చట్టపరమైన అంశాలు, చట్టాలను కూడా పరిశీలిస్తుంది. ఈ ఘటనలను నిరోధించడానికి చట్టాలను రూపొందించాల్సిన చట్టాలను ఈ కమిటీ తెలియజేస్తుంది.
ఈ సందర్భంగా మహారాష్ట్ర మంత్రి మంగళ్ లోధా మాట్లాడారు. దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ సంఘటనలు పెరిగాయని, ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అభిప్రాయ పడ్డారు. శ్రద్ధా వాకర్ ను ఎలా ముక్కలు చేశారో మనం చూశాం., రూపాలీ చందన్ శివేని ఎలా చంపేశారో చూశాం, యశశ్రీ షిండేను ఎలా హతమార్చారో చూశాం, ఇంకా ఎంతమందిని చంపేస్తారంటూ మంగళ్ లోధా ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికే చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి అని, లవ్ జిహాద్‌ను ఆపడానికే ఈ ప్రయత్నం అని వివరించారు.
ఇప్పటికే గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొని వచ్చాయి. ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఇదే ప్రయత్నాల్లో ఉంది. ఇది చట్టరూపం దాలిస్తే మరాఠీ అమ్మాయిలకు మంచిరోజులు వచ్చినట్లే.