ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే తిరిగి ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ తాజా సర్వే తేల్చింది. 543 స్థానాలకు గానూ ఎన్డీఏ 296 స్థానాలు గెలుచుకుంటుందని, యూపీఏ 127 స్థానాలు దక్కించుకుంటుందని సర్వే సారాంశం. ఇక ఇతరులకు 120 స్థానాలు దక్కుతాయని తేలింది. ఎన్డీఏకు వచ్చే 296 స్థానాల్లో ఒక్క బీజేపీకే 271 స్థానాలు దక్కవచ్చని అంచనా. కాంగ్రెస్ పార్టీకి 62 స్థానాలు వస్తాయని సర్వే చెబుతోంది. ఏపీ అసెంబ్లీకి ఇప్పడికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ తిరిగిఅధికారంలోకి వస్తుందనీ తాజా సర్వే అంచనా.