నరేంద్ర మోడీ మరియు అతని ప్రభుత్వం హిందూ తీవ్ర వాద మార్గాన్ని అనుసరిస్తున్నాయని ఇది భారతీయ లౌకికవాదానికి ముప్పు అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
ప్రశ్నలు ఇవి:
అసలు ఫండమెంటలిజం అంటే ఏమిటి?
అది హిందూ మతంలో ఉందా?
హిందూ జాతీయవాదం ముప్పుగా అనుకున్నప్పుడు వామపక్షాలు మరియు ఉదారవాద పశ్చిమ దేశాలు ఇస్లాంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి?
ఫండమెంటలిజం ఏ మతంలోనైనా ఉండాలంటే, దానికి కొన్ని సాధారణ లక్షణాలు మరియు ఒక సాధారణ భావజాలం ఉండాలి.
క్రైస్తవ మతం యొక్క ఉదాహరణ తీసుకోండి. మీరు త్రిమూర్తులు మరియు పరిశుద్ధాత్మను విశ్వసించకపోతే మీరు క్రైస్తవులుగా ఉండలేరు, అలాగే అల్లాహ్ మాత్రమే నిజమైన దేవుడు మరియు ముహమ్మద్ అతని చివరి దూత అని మీరు విశ్వసించకపోతే మీరు ముస్లింలు కాలేరు.
మరోవైపు, హిందూమతానికి ఒక్క వ్యవస్థాపకుడు లేదా విస్తృతంగా ఆమోదించబడిన సిద్ధాంతాలు లేవు. దీనికి జాతి లేదా వర్ణం వంటి భౌతికంగా నిర్వచించే లక్షణం లేదు. ఇది వేలాది విభిన్న గుర్తింపులను కలిగి ఉంది. ఇస్లాం లేదా క్రైస్తవ మతం వలె దీనికి ఒకే భావజాలం లేదు. కాబట్టి, ఇక్కడ ఫండమెంటల్స్ లేనందున ఇది ఫండమెంటలిస్ట్గా మరే అవకాశం లేదు అని నేను వాదించాను. ఈ విశ్వాసంలో కొంతమంది అనుచరులు తమ గుర్తింపులను మరింత దృఢంగా చెప్పగలరని వారు మిలిటెంట్ మరియు హింసాత్మకంగా మారవచ్చు అని చెప్పవచ్చు. కానీ హిందూ మతం క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతం లాగా ఒక నిర్దిష్ట స్థాయికి మించి తీవ్రవాదం గా మారదు.
ఏకేశ్వరాధన లేదా ఓకే దైవం అనేది దాని ప్రాథమిక స్వభావంలోనే తీవ్రవాదం మరియు నిరంకుశత్వంతో ముగుస్తుంది. ఇస్లాం కోసం, మిగిలిన వారందరూ ‘కాఫిర్లు’, ‘విగ్రహారాధకులు’, ‘అవిశ్వాసులు’ వంటి ద్వేషానికి గురవుతారు. మరోవైపు, ఏకమ్ సత్ విప్రా బహుద వదంతి.- రుగ్వేదం. (నిజం ఒకటి; రుషులు దీనిని వివిధ పేర్లతో పిలుస్తారు.) ఇది హిందూ మతం నిర్వచించే దైవ తత్వం.
అసలు ఇస్లాం మరియు మార్క్సిజంలో ఎందుకు ఫాసిజం తీవ్రంగా పెరిగింది?, మరియు వామపక్ష-ఉదారవాద-ముస్లిం మధ్య గట్టి సంబంధాలు ఎందుకు ఉన్నాయో మనం గుర్తించాలి.
మనం లోతుగా పరిశీలిస్తే, ఫాసిజం మరియు నిరంకుశత్వం అన్నవి నిజంగా వామపక్ష మరియు ఇస్లాం సిద్ధాంతాలు అని మనం కనుగొంటాము. సామాజిక న్యాయం కోసం ఇస్లాం మరియు మార్క్సిజం రెండూ నిరంకుశ పాలనకు మద్దతునిస్తాయి. మార్క్స్ యొక్క ఆదర్శధామ వర్గ రహిత సమాజానికి శ్రామికులపై నియంతృత్వం అవసరం. అలాగే ఆధునిక ఇస్లామిక్ ఆలోచనాపరులందరూ ‘ప్రజాస్వామ్యం’ ఇస్లాం యొక్క ప్రాథమిక సిద్ధాంతానికి వ్యతిరేకం అని నమ్ముతారు,కారణం దీనిలో అల్లా సార్వభౌముడు ప్రజల ఇష్టం కాదు.
ఇస్లాం నాజీయిజంతో ఒక సహజమైన ప్రేమను కలిగి ఉంది. నాజీ నినాదం: ఈన్ వోల్క్, ఐన్ రీచ్, ఐన్ ఫ్యూరర్ (ఒక ప్రజలు, ఒక దేశం, ఒక నాయకుడు) లా-ఇలాహా ఇల్-అల్లా మొహమ్మద్-ఉర్ రసూల్ అల్లా) ఇక్కడ ఫ్యూరర్ స్థానంలో మహ్మద్ చేర్చిట్లయితే అదే.
రెండో ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్, జెరూసలేం గ్రాండ్ ముఫ్తీ, అమిన్ అల్-హుస్సేనీ మధ్య కుమ్మక్కు యాదృచఛికంగా జరిగే అవకాశం లేదు. అంతేకాదు పబ్లిక్ లో మరియు ప్రైవేట్ లో కూడా హిట్లర్ చెపుతూ ఒక మతంగా మరియు రాజకీయ సిద్ధాంతంగా, క్రైస్తవ మతం కంటే ఇస్లాం మరింత క్రమశిక్షణ, సైనిక, రాజకీయ మరియు ఆచరణాత్మక మతం అని అభివర్ణించారు. అంతేకాదు రాజకీయాల్లో ప్రవక్త ముహమ్మద్ యొక్క నైపుణ్యం మరియు సైనిక నాయకత్వం గొప్పది అని వారు తెలుసుకున్న దాన్ని ప్రశంసించారు. .
ఇస్లాం & క్రిస్టియానిటీ మతాలుగా, ఫాసిజం గా మరియు మార్క్సిజం-లెనియనిజం-మావోయిజం రాజకీయ సిద్ధాంతాలుగా చరిత్రలో మానవ రక్తంలో మునిగిపోయాయి.
మానవజాతి ప్రస్థానంలో యే సంస్థా ఎన్నడూ లేనంతగా చర్చి ఆఫ్ రోమ్ అమాయకల రక్తం చిందించింది. 606 లో పాపరీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు, పాపిష్ మతవిశ్వాస నేరం మీద యాభై మిలియన్లకు పైగా మానవ కుటుంబాలు వధించబడ్డారని విశ్వసనీయ చరిత్రకారుల ద్వారా జాగ్రత్తగా అంచనా వేయబడింది. గత కొన్ని శతాబ్దాలుగా సైన్స్ , మరియు కొంచం జ్ఞానం తెచ్చుకోవడం వల్ల క్రైస్తవ మతం తనను తాను సంస్కరించుకుంది.
మార్క్సిజం-లెనినిజం ఆర్థిక సిద్ధాంతంగా దాని స్వంత మరణాన్ని అది చవిచూసింది లేదా తనను తాను సంస్కరించుకుంది. నేడు యూదులు మరియు క్రైస్తవ దేశాలు ప్రజాస్వామ్య దేశాలు. కానీ ముస్లిం మెజారిటీ దేశాల విషయంలో అలా కాదు. 8వ మరియు 10 వ శతాబ్దాల మధ్య ఇస్లాం తనపై తర్కానికి దారులు మూసివేసింది. ఇప్పటి వరకు అది అలాగే ఉంది. ఇస్లాం ప్రవక్త రాజకీయ, మతపరమైన మరియు సైనిక నాయకత్వం కలబోసిన నేత. ఆ కారణంగా ఇస్లాం మిలిటెన్సీ మరియు ఉగ్రవాదానికి మూలంగా ఉంది. ఇస్లాం యొక్క ఆధునిక ఆలోచనాపరులు ఇస్లాంను కేవలం ఒక మతం గా మాత్రమే కాకుండా ఇస్లామిక్ ఆలోచన మరియు ఆదర్శాల ద్వారా స్వర్గం మరియు భూమిని కలిపి సామ్రాజ్యంగా పాలించగలిగే ఒక శక్తి భావజాలంగా భావిస్తారు.
ఇస్లామిక్ ఆలోచన ఫాసిజం మరియు కమ్యూనిజం కు అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఈ నమూనాలన్నీ నాయకుడిదే ఆధిపత్యం మరియు ఆలోచనా స్వేచ్ఛను హరించడం పై ఆధారపడి ఉంటాయి. ఇస్లాం, మార్క్సిజం మరియు నాజీయిజం ల ఇంజిన్లను నడిపే ఇంధనం “ద్వేషం”. ఈ ద్వేషం యొక్క కారణాలు మాత్రమే మారతాయి, అంటే నాజీయిజంలో అది జాతి, కమ్యూనిజంలో అది తరగతి మరియు ఇస్లాంలో అవిశ్వాసులు.
వామపక్ష-ఉదారవాద మరియు ఇస్లాం సహజ పడక భాగస్వాములు. మోడి మరియు బిజెపిని ఫాసిస్ట్గా ఆరోపించడం అనేది వామపక్ష -లిబరల్ హిందూ – ఇస్లామిస్ట్ సంబంధాలు భారతీయ లౌకికవాదానికి ఎదురయ్యే నిజమైన ఫాసిస్ట్ ముప్పు నుండి దృష్టిని మళ్లించే వ్యూహం తప్ప మరొకటి కాదు.
Khalid Umar
…ఖలీద్ ఉమర్…
(ఇంగ్లాండ్ లో నివసిస్తున్న పాక్ జాతీయుడు)
స్వేచ్ఛానువాదం – …..చాడా శాస్త్రి…