సమ సభకు వచ్చిన ప్రజలనుంచి అనుకోని స్పందన చూసి షాకయ్యారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. హర్యానా పానిపట్ లో ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ… బీజేపీపై మండిపడ్డారు ఖర్గే. అదే సందర్భంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకుందా అని అక్కడున్నవారిని అడగ్గా…. వాళ్లంతా అవును అని గట్టిగా అరిచారు.మీలో ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చాయా అని మరోసారి అడగ్గా… గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేశారు. అక్కడున్నవారినుంచి ఆ స్పందనను ఊహించని ఖర్గే అవాక్కయ్యారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH via ANI Multimedia | Mallikarjun Kharge’s embarrassing moment when he tries to question Modi govthttps://t.co/OrDueTP3A5
— ANI (@ANI) January 7, 2023