ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ కన్ను ఈసారి హాలీవుడ్ సినిమాలమీద పడింది. ఎవరైనా పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తూ దొరికిపోతే వాళ్ల తల్లిదండ్రులను జైల్లో వేస్తామని ప్రకటించాడు. ఆ సినిమాలు చూస్తే ఎవరైనా తిరగబడుతారేమోనని, అలాగే పాశ్చాత్య విధానాలు దేశంమీద పడకూడదని ఈ ఆదేశాలు జారీచేశాడు.తాజా ఆదేశాల ప్రకారం సినిమాచూస్తూ ఎవరైనా దొరికిపోతే తల్లిదండ్రులను ముందు కార్మిక శిబిరాలకు పంపుతారు. పిల్లలకేమో ఐదేళ్ల శిక్ష విధించి శిబిరాలకు పంపుతారు.
గతంలోనూ సినిమాల విషయంలో దక్షిణ కొరియా కఠిననిర్ణయాలు తీసుకుంది. సినిమాల కేసట్లు కలిగి ఉన్న ఇద్దరు పిల్లలకు మరణశిక్ష విధించారు. ఇక ఎవరన్నా బ్లూఫిల్మ్ చూస్తున్నట్టు సమాచారం అందితే కాల్చిచంపాలనీ ఆదేశించారు