పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ICSE ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితో 12 వతరగతి పరీక్షలను మాత్రంబోర్డు వాయిదా వేసింది. పరీక్షలను కొన్ని రోజుల అనంతరం ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకైతే 12 వ తరగతి బోర్డు ఎగ్జామ్ తేదీలను ఖరారు చేయలేదు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీన విడుదల చేసిన ఎగ్జామ్స్ సర్క్యూలర్‌ను ఉపసంహరించుకున్నామని బోర్డు ప్రకటించింది.
విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం తమకు ముఖ్యమని ప్రకటనలో తెలిపారు. అసలైతే విడుదలైన షెడ్యూల్ ప్రకారం 12 తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 14 వరకూ జరగాల్సి ఉంది.ఇక సీబీఎస్సీ బోర్డు కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ఇంటర్ పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ICSE cancels class 10 board examinations, in the wake of #COVID19 situation. The status of exams for class 12 remains the same as the previous order – Class 12 Exam (offline) will be conducted at a later date. pic.twitter.com/59yD583ShL
— ANI (@ANI) April 20, 2021