అటు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందును అన్నివిధాలా పరిశీలిస్తామని భారత వైద్య పరిశోధనా మండలి..ఐసీఎంఆర్ బృందం తెలిపింది. మందు శాస్త్రీయత నిర్ధారణ అయ్యి…చట్టబద్దత కల్పిస్తే ఎక్కువమందికి అందే అవకాశం ఉందని ఆయుష్ కమిషనర్ తెలిపారు. మందును పరిశీలించి.అధ్యయనం చేసి శాస్త్రీయతను పరీక్షించి ప్రబుత్వానికి నివేదిక అందచేయనున్నారు. నివేదికని త్వరితగతిన పంపడం జరుగుతుంది. రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆయుష్ కమిషనర్ తెలిపారు.
ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుపై గందరగోళం తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వవిభాగాల అధికారులతో పరీక్షలు నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో ఆయన నిర్ణయం మేరకు ఐసీఎంఆర్ బృందం కృష్ణపట్నం చేరుకుంది. మందుపై రెండు బృందాలు అధ్యయనం చేయనున్నాయి.
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రులు సైతం కిక్కిరిసిపోయాయి. ఆక్సిజన్ అందక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అదే సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడకు తరలివస్తున్నారు. అయితే శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. పరీక్షల నిమిత్తం ఆయుష్ ల్యాబ్‌కు పంపింది. మెడికల్ మాఫియా కావాలనే ఆనందయ్య మందును అడ్డుకుంటోందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. చాలామంది ఆనందయ్యకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇక ఉధయం నుంచి పెద్దసంఖ్యలో జనం కృష్ణపట్నంచేరుకున్నారు. వేలాది వాహనాల్లో జనం వచ్చారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. క్యూలైన్లలో తోపులాట కూడా జరిగింది. అసలైతే అధికారులు మందు పంపిణీకి అనుమతివ్వలేదు. అనంతరం గందరగోళ పరిస్థితుల్లో పంపిణీ ప్రారంభించినా కాసేపటికే నిలిపేశారు. ఈ రోజుకు మందు నిలిపేస్తున్నట్టు పోలీసులు ప్రకటించడంతో అంతా నిరాశగా వెనుదిరిగారు.