హిందువుల మీద విషం చిమ్మటం సినిమా రంగంలో బాగా అలవాటు. కారణం లేకపోయినా.. విలన్స్ కు పెద్ద బొట్టు పెట్టడం, పూజలు చేయించటం చేస్తుంటారు. అనాధ శరణాలయాలు దగ్గర మదర్ థెరీసా బొమ్మ పెడుతున్నారు. యువత మెదళ్ళ లో పూజ పురస్కారాల మీద తప్పుడు ప్రభావం రుద్దుతుంటారు.
హిందీ సినిమా ల్లో మరీ దారుణం గా చూపిస్తుంటారు. తాజాగా.. ఒక వెబ్ సిరీస్ లో విలన్స్ అసలు పేర్లు ముస్లిం కమ్యూనిటీవి అయితే.. వాటిని ఉద్దేశ పూర్వకం గా హిందూ పేర్లు గా మార్చేశారు. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయిన
అనుభవ్ సిన్హా తాజా వెబ్ సిరీస్.., “”`ఐసి 814: ది కాందహార్ హైజాక్ స్టోరీ”” … లో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అప్పట్లో విమానం ఎత్తుకెళ్లి న హైజాకర్లు హిందువులే అని కలరింగ్ ఇచ్చారు.
ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 814ను 1999లో హైజాక్ చేయడం తెలిసిందే . తాలిబాన్ నియంత్రణలో ఖాట్మండు నుండి కాందహార్ వరకు ఈ విమానం ప్రయాణాన్ని ఈ వెబ్ సిరీస్ వర్ణిస్తుంది. అయితే, అందులో పాత్రల పేర్లు విషయంలో, నాటి వాజపేయి ప్రభుత్వంపై ప్రతికూలత వ్యక్తం చేసే విషయమై ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సిరీస్లో ఉగ్రవాదుల పేర్లను హిందువులుగా మార్చి, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయంపై సోషల్ మీడియాలో #BoycottNetflix, #BoycottBollywood వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. వెబ్ సిరీస్ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా హైజాకర్ల పేర్లను “భోలా”, “శంకర్” గా మార్చారు.
ది కెప్టెన్ స్టోరీ’ని స్రింజోయ్ చౌదరి, ఫ్లైట్ కెప్టెన్ దేవి శరణ్ అని రాశారు. అయితే, మీడియాలోని విభాగాలు హైజాకర్ల పేర్లను అసంబద్ధంగా, సత్యాన్ని తప్పుగా సూచించేవిగా ఉన్నాయి . దీంతో ఈ ప్రదర్శనను బహిష్కరించాలని పిలుపిస్తూ సోషల్ మీడియాలో అలజడి చెలరేగింది. కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా కేవలం కోడ్నేమ్లు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు, కానీ అవి కూడా తప్పు గా ఉన్నాయి.
ఐసి-814 హైజాకర్లు భయంకరమైన ఉగ్రవాదులని, వారి ముస్లిం గుర్తింపులను దాచడానికి వారిని మారు పేర్లతో చూపించడం పట్ల బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
“చిత్రనిర్మాత అనుభవ్ సిన్హా ఉగ్రవాదుల అసలు పేర్లను మార్చి, వారి నేరపూరిత ఉద్దేశాన్ని చట్టబద్ధం చేశారు,” అని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఎక్స్లో పోస్ట్ చేశారు. “దశాబ్దాల తరువాత, హిందువులు ఐసీ -814 ను హైజాక్ చేశారని ప్రజలు అనుకుంటున్నారు. ఇది దీర్ఘకాలంలో భారతదేశ భద్రతా యంత్రాంగాన్ని బలహీనపరస్తుంది,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“పాకిస్తానీ ఉగ్రవాదులు, ముస్లింలందరి నేరాలను కప్పిపుచ్చే వామపక్షాల ఎజెండా అనుగుణంగా ఈ చిత్రం ఉంది. ఇది సినిమా శక్తి. ఇది కమ్యూనిస్టులు 70ల నుండి ఇటువంటి సాధనాన్ని దూకుడుగా ఉపయోగిస్తున్నారు. బహుశా అంతకుముందు కూడా” అని మాల్వియా ధ్వజమెత్తారు. “దీర్ఘకాలంలో భారతదేశ భద్రతా యంత్రాంగాన్ని బలహీనపరచడం/ప్రశ్నార్థకం చేయడమే కాకుండా, రక్తపాతానికి కారణమైన మతపరమైన సమిష్టి నుండి నిందను దూరం చేస్తుంది” అని ఆయన తెలిపారు.
దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నెట్ ఫ్లిక్స్ ఇండియా టీంకు కేంద్ర ప్రసార సమాచార శాఖ నోటీసులు జారీ చేసింది.