యూట్యూబ్, ట్విట్టర్ తమ సైట్ల నుంచి లేయర్స్ కంపెనీ ద్వారా రూపొందిన ‘షాట్’ అనే వివాదాస్పద బాడీ స్ప్రే యాడ్‌ను తొలగించాలని I&B మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అడ్వర్టైజింగ్ కోడ్ ప్రకారం ఈ వ్యాపార ప్రకటనలపై విచారణ జరుపుతామని కేంద్రం స్పష్టం చేసింది. (Layer’r Shot) Deodorant advertisement దేశంలో Rape Mentalityని ప్రోత్సహించే విధంగా ఉందని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ చెప్పారు.
https://twitter.com/ANI/status/1533039536321986560?s=20&t=urC4me6dPSWtGxrqoExthQ
Deodrant బ్రాండ్ కు సంబందించిన రెండు ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రోజు తర్వాత ఈ ఆదేశాలు వచ్చాయి.
ఒక ప్రకటనలో, నలుగురు పురుషులు ఒక సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్న మహిళ వైపు చూస్తూ కనిపించారు. “మేం నలుగురం అది ఒకటి? ఎవరు షాట్ తీసుకోబోతున్నారు అని ఒక వ్యక్తి అడిగుతాడు. ఆ తర్వాత ఒకతను Layer ‘r Shot బాటిల్‌ని పట్టుకుని చూపిస్తాడు. ఆ మహిళా అది చూసి కుదుటపడినట్టు చూపించారు.
https://twitter.com/RishitaPrusty_/status/1532632641815515136?s=20&t=_wUkmkTZDAq8-waeouA2TA
మరొక ప్రకటనలో, పడకగదిలో ఒక జంటతో ప్రారంభమవుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ కుర్రాడి స్నేహితులు నలుగురు గదిలోకి ప్రవేశించి, ‘బాయ్‌ఫ్రెండ్’ని అడిగారు, “షాట్ మార లగ్తా హై” అని అంటాడు. యువతి షాక్ అవుతుంది. వారిలో ఒకరు తన స్లీవ్లను పైకి లేపి, “అబ్ హుమారీ బారీ (ఇప్పుడు మా వంతు)” అంటూ మంచం దగ్గరికి వెళ్లడం ప్రారంభింస్తాడు. ఆ యువతి భయంతో వెనక్కి తిరిగింది, బహుశా దాడి చేయనున్నాడేమోనని, అయితే ఆ వ్యక్తి డ్రస్సర్ నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్‌ను తీసుకుంటున్నాడని ప్రకటన వెల్లడిస్తుంది.
https://twitter.com/mumbaiactor_/status/1532811639359418368?s=20&t=JMw4ZDdfsWalLtFpCmAQMA
అత్యాచారాన్ని ప్రోత్సహించే గగుర్పాటు కలిగించే ప్రకటనలతో వస్తున్నందుకు ట్విట్టర్ వినియోగదారులు బ్రాండ్ పై ఆగ్రహించారు. ఇలాంటి అసహ్యకరమైన కంటెంట్‌ను ఎవరు ఆమోదించారని చాలా మంది అడిగారు.