తనకు కేంద్రప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదంటూ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేత మాజీఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. ఢిల్లీలో ప్రస్తుతం ఆయన ఉంటున్న నివాసాన్ని ఖాళీచేయాలంటూ న్యాయస్థానం గతనెలలో ఆదేశాలిచ్చింది.అందుకు ఆరువారాల గడువునూ ఇచ్చింది.అయితే గడువు ముగిసినా ఆయన ఆ ఇంటిని ఖాళీ చేయలేదు. తన వ్యక్తిగత నివాసానికి తగిన భద్రతా ఏర్పాట్లు చేయనందునే ఖాళీచేయడం లేదంటూ కోర్టుకు తెలిపారు స్వామి. సెప్టెంబర్ 14 నాటి ఆదేశంమేరకు … తగిన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన తరువాతనే… అక్టోబర్ 26 లోగా ప్రభుత్వ వసతి గృహాన్నివదిలిపెట్టేందుకు తమ క్లయింట్ అంగీకరించారని ఆయన తరపు న్యాయవాది జయంత్ మెహతా గుర్తుచేశారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. 2016లో ఆయనకు లుటియన్స్ బంగ్లా జోన్లోని పందారారోడ్డులో బంగ్లాను కేటాయించింది కేంద్రం. అసలైతే ఆయనప్పుడు ప్రైవేట్ వ్యక్తే. కానీ బెదిరింపులు వస్తుండడంతో భద్రతాకారణాల రీత్యా వీవీఐలకు కేటాయించే ఇంటిని కేటాయించారు.
Subramanian Swamy moves Delhi High Court claiming that adequate security arrangements were not done by Centre as he was directed to hand over of possession of his government accommodation.@Swamy39 pic.twitter.com/zmTmvVtuf7
— Live Law (@LiveLawIndia) October 27, 2022
తరువాత బీజేపీ నుంచి ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్లో రాజ్యసభ గడువు ముగిసిన తరువాత కూడా దాన్నే కొనసాగించాలంటూ ఆయన కోర్టుకెళ్లారు. భద్రతా కారణాల రీత్యానే దాన్ని తనకు కేటాయించారని…రాజకీయ కారణం చూపుతూ ఖాళీచేయమనడం సరికాదని ఆయన వాదన. జెడ్ కేటగిరీ రక్షణ వలయం ఉన్న తనకు… తన సెక్యూరిటీ గార్డులు ఉండేలా టైప్ 7 బంగ్లాను తిరిగి కేటాయించాలని కోరుతున్నారు స్వామి. అయితే ఇతర మంత్రులు, ఎంపీలకు ఇళ్లు కేటాయించాల్సి ఉందని కేంద్రం అంటోంది. ఆయన జెడ్ కేటగిరీ భద్రతను తగ్గించలేదని… బంగ్లా మాత్రం మారుస్తున్నామని… కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ అషీష్ జైన్ అన్నారు.దీంతో కోర్టు సెప్టెబర్ 14న స్వామి పిటిషన్ ను తిరస్కరిస్తూ…6 వారాల్లోగా బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. అంతేకాదు నిజాముద్దీన్ ఈస్ట్ లో తనకున్న నివాసంలో సరైన భద్రత కల్పించాలనీ ఆదేశించింది. గడువు ముగిసిన వేళ సరైన భద్రత కల్పించలేదని మళ్లీ కోర్టుకెళ్లారు స్వామి.