మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
“మా దేవుళ్లపై అసభ్య పదజాలం ఉపయోగించే వ్యక్తులను మాత్రమే తాను ప్రశ్నించానని.. ఏ మతానికి చెందిన వ్యక్తుల మతపరమైన మనోభావాలను అవమానించే ఉద్దేశం తనకులేదని అన్నారు. నేను ‘సర్వ ధర్మ సమభావన’ని నమ్ముతాను, దేశంలో శాంతి నెలకొనాలని నేను (బాంకే) బీహారీ జీని ప్రార్థిస్తాను” అని అన్నారాయన.
జిందాల్ తన కుటుంబంతో కలిసి మధురలోని బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించారు.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తనకు ప్రాణహాని ఉందని, దీంతో తన కుటుంబం ఢిల్లీ నుంచి వెళ్లిపోయిందని తెలిపారు.
తన భద్రతపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. “నేను బాంకే బిహారీ మహారాజ్ పాదాల వద్దకు వచ్చాను. ఇంతకంటే గొప్ప భద్రత ఏముంటుంది? బెదిరింపుల గురించి నేను ఢిల్లీ పోలీసులకు తెలియజేశాను, వారి పనిని వారు చేస్తోన్నారు” అని అన్నారు.