తాను పొరపాటున ఎన్డీఏ అభ్యర్థికి ఓటువేశానన్న వార్తల్లో నిజం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బాలెట్ పేపర్లో పేర్లకు పైన స్కెచ్ మార్క్ పడడంతో రిటర్నింగ్ అధికారిని మరో పేపర్ అడిగానని స్పష్టత ఇచ్చారు. అయితే వాళ్లు గంటసేపు కూర్చోబెట్టి మరో పేపర్ ఇచ్చేందుకు నిరాకరించడం తో తమ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థికే ఓటువేశానని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటా తప్ప పార్టీ విధానానికి విరుద్ధంగా తాను వెళ్లబోనని ఆమె అన్నారు. అసలేం జరిగిందో చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు సీతక్క.