తమకెందుకు దళితబంధు ఇవ్వరని ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించిన హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన అమ్మాయిలను మాజీ మంత్రి ఈటల రాజేెందర్ స్వయంగా అభినందించారు. గ్రామానికి చెందినప్రవల్లిక, పరిమళ, గౌతమి, ధనలక్ష్మిలో తనకు ఒక సమ్మక్క సారక్క, రాణి రుద్రమ కనిపించారని మెచ్చుకున్నారు. దళితులందరికీ పదిలక్షలు ఇవ్వకుంటే దీక్ష చేస్తామన్న వీరి తెగువ గొప్పదని ఆయన అన్నారు.
కెసిఆర్ ఇచ్చే డబ్బులు ఆయన ఇంటినుండి ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఈటల అన్నారు. తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని.. దళిత బంధు పొందడం తన జన్మహక్కుఅని ప్రవల్లిక అంది. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్లకి, డబ్బులు ఉన్నవాళ్ళకి ఇచ్చారని…అందుకే తాను ప్రశ్నించానని ఆమె అంది.