బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి ప్రసంగించిన రుషి సునాక్ ఐక్యత, స్థిరత్వం, దేశ అభివృద్ధే తనకు తొలి ప్రాధాన్యమన్నారు. బోరిస్ జాన్సన్, పెనీ మోర్డౌంట్ పోటీనుంచి తప్పుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రిషి. తనను ఎన్నుకున్న కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. తానెంతో ప్రేమించే దేశానికి సేవ చేసే అవకాశాన్నివ్వడం అదృష్టంగా భావిస్తున్నారు చెప్పారు. వర్తమానంలోని సవాళ్లు అధిగమిస్తూ భవిష్యత్ తరాలకు మంచి రోజులను అందించేందుకు తన కృషి తాను చేస్తానని..సదా బ్రిటన్ వాసుల సేవలో ఉంటానని రిషి అన్నారు.
I pledge that I will serve you with integrity and humility and I will work day in and day out to deliver for the British people: The United Kingdom PM-designate #RishiSunak at the Conservative Party Headquarters in London. pic.twitter.com/GWspDoXyNE
— ANI (@ANI) October 24, 2022