హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీపడే అధికార పార్టీ అభ్యర్థి ఎవరనే చర్చకు తెరపడింది. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా శ్రీనివాస్ పేరును ఖరారు చేశారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాలు చేశారు. అభ్యర్థి ఎవరనేది తేలడంతో గులాబీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఎన్నికల రణక్షేత్రంలో పాల్గొంటున్నాయి.